కేజే కుమార్ అరెస్టు kj Kumar arrested | Sakshi
Sakshi News home page

కేజే కుమార్ అరెస్టు

Published Thu, Jul 14 2016 1:40 AM

kj Kumar arrested

వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌తో పాటు ఆయన కుమారుడు కేజే మురళిని బుధవారం నగరి పోలీసులు అరెస్టుచేశారు. ఈనెల 3న నగరిలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతికుమార్‌పై ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు దాడిచేసిన విషయం తెలిసిందే.


ఆమె  తొలుత తిరుపతిలో, అనంతరం చెన్నైలో చికిత్స పొందారు. ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ముద్దుకృష్ణమనాయుడు పదిరోజుల క్రితం ఫిర్యాదుచేశారంటూ పోలీసులు బుధవారం కేజే కుమార్‌ను, ఆయన తనయుడిని అరెస్టు చేశారు. దీంతో నగరిలో ఉద్రిక్తత నెలకొంది.        

Advertisement
 
Advertisement
 
Advertisement