కొప్పు చూడు.. కొప్పందం చూడు! | Koppandam Feedback Feedback hair ..! | Sakshi
Sakshi News home page

కొప్పు చూడు.. కొప్పందం చూడు!

Published Sat, Sep 13 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

Koppandam Feedback Feedback hair ..!

  • మార్కెట్లో రెడీమేడ్ కొప్పులు
  •  సింగారించుకుంటున్న మహిళలు
  • తిరుపతి కల్చరల్ : జుట్టున్నమ్మ ఎంత కొప్పైనా వేస్తుంది.. ఇది నాటి మాట. జుట్టులేనమ్మ కూడా తాను కోరిన కొప్పు వేసుకోవచ్చు.. ఇది నేటి మాట. వనితల జుట్టు పలచగా, కురచగా ఉన్నా తాము కోరిన కొప్పును వేసుకునే సౌలభ్యం లభిస్తోంది. కొప్పులు చుట్టుకోవడంలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన వాణిశ్రీని మళ్లీ మగువలు ఫాలో అవుతున్నారు. కొత్త కొత్త వెరైటీలతో నగర వనితా లోకం ఇప్పుడు కొప్పు చూడు కొప్పందం చూడు అంటోంది.

    యాంత్రిక జీవితంలో బిజీగా కాలం వెళ్లదీస్తున్న నగర యువతులకు వాలుజడలపై మోజు ఉన్నా వాటిని మెయింటెన్ చేసే తీరిక లేక పోనిటెయిల్‌కు షిప్ట్ అవుతున్నారు. పండుగలు, పబ్బాలు వ చ్చే సరికి కొందరు పొడవాటి జడ లేదని ఆవేదన చెందుతున్నారు. అప్పటి కప్పుడు కురులు పొడువైతే బాగుండు అని ఆశపడుతుంటారు. సవరంతో జుట్టును కాస్త సవరించుకున్నా అదెక్కడ ఊడిపోతుందోనని ఆందోళనతో వాటిని పక్కన పెట్టేశారు. ఇలాంటి మగువల ఆందోళనకు చెక్ పెడుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రెడీమేడ్ కొప్పులు మార్కెట్‌లోకి వచ్చాయి.
     
    జుట్టు కొద్దీ కొప్పు


    రెడీమేడ్ కొప్పులు ఇప్పుడు సిటీ వనితలను ఆకర్షిస్తున్నాయి. జుట్టుకు తగ్గ కొప్పులు వచ్చేశాయి. ట్రెడిషనల్, ఫంక్షనల్ ఇలా సందర్భానికి తగిన విధంగా ప్రిపేర్ చేసిన సిగలు లభిస్తున్నాయి. హెయిర్ స్టైల్‌కు, కలర్‌కు తగిన కొప్పులపై యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఎలాస్టిక్‌టైప్, క్లచ్ క్లిప్, హెయిర్‌పిన్ టైప్ వంటి కొప్పులు గంటల తరబడి సెట్ చేసుకునే పనిలేకుండా ఈజీగా ఇమిడిపోతున్నాయి. సిగను మరింత అందంగా చూపించే హెయిర్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొప్పును ముస్తాబు చేసేందుకు ముత్యాలు, క్రిస్టల్స్, గ్లిటరింగ్ ఫ్లవర్స్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. సిగలో తురుముకునేందుకు బంగారు, వెండి పూలు మార్కెట్లో విరబూస్తున్నాయి.
     
    సహజంగా ఉండే అధునాతన కొప్పులు

    జుట్టు పలచగా ఉన్నవారు, లేనివారికి కూడా తమ కురులను పోలిన రెడీమేడ్ కొప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖానికి సరిపడేలా సుందరమైన సిగకొప్పులు వేసి మహిళలకు మరింత అందాలు దిద్దుకొనే సౌలభ్యం ప్రస్తుతం ఉంది. సిగ వెంట్రుకులకు క్లిప్పింగ్ అమర్చి నార్మల్ హేర్స్‌లాగా కొప్పులు అల్లడం హేర్ ఎక్స్‌ట్రన్స్ అందుబాటులో ఉన్నాయి.
     - బి.పూర్ణిమాలత, అడ్వాన్స్ డిప్లొమా ఇన్
      కాస్మోటాలజి, పీఆర్‌సీ బ్యూటీ పార్లర్ అధినేత

     
    బ్రైడల్ నాట్స్...

    రిసెప్షన్ వేడుకల్లో కాస్త డిఫరెంట్ గా కనిపించాలనుకుంటున్న వధువులు బ్రైడల్ నాట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. గాగ్రా, ఫ్రంట్‌పల్లు శారీస్, హాఫ్ శారీస్, ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్స్‌కు నప్పే విధంగా సిగలు ధరిస్తున్నారు.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement