సాక్షి; హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో విచారణ పరిధిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం చేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను మహారాష్ట్ర గురువారం కోరింది. ఢిల్లీలో ట్రి బ్యునల్ ముందు జరుగుతున్న విచారణలో మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది అంద్యార్జున రెండో రోజూ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ తుది తీర్పుతో కేటాయింపుల అంశం పూర్తయిందని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంచుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. తొలిరోజు కర్ణాటక కూడా ఇదే తరహాలో వాదించినట్లు తెలిసింది.