అసెంబ్లీలో ప్రశ్నించిన
కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్యుల్లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, మరో నలుగురిని నియమించాలని గతంలో సభ దృష్టికి తీసుకొచ్చినా ఇంతవరకు స్పందన లేదని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బుధవా రం శాసనభలో జీరో అవర్‌లో ప్రశ్నించారు. భద్రగిరి సీహెచ్‌సీలో ఉన్న ఒక్క వైద్యుడు పూర్తి స్థాయిలో గిరిజనులకు వైద్యం చేయలేకపోతున్నారని ఆమె వివరించారు.
దీంతో రోగులు పార్వతీపురం, విజయనగరం ప్రాంతాలకు వ్యయప్రయూసలకు గురై వెళ్తున్నారని, అక్కడ కూడా గిరిజన రోగు లు వివక్షకు గురవుతున్నారని వివరించారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఐదుగురు వైద్యులకు ఒక్కరే ఉన్నారన్నారు. మిగతా నాలుగు పోస్టులను భర్తీ చేయాలని గత సమావేశాల్లో కోరినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని గుర్తు చేశారు. ఈసారి తప్పకుండా భర్తీ చేస్తామని సంబంధిత మంత్రి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సాక్షికి చెప్పారు.
భద్రగిరి సీహెచ్‌సీ వైద్యుల నియూమకంలో జాప్యం
Published Wed, Mar 9 2016 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement