ఆర్టీసీ కార్మికులను చావబాదారు
చిత్తూరు: తమ డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఏపీ పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బస్సు డిపోల ఎదుట శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా బాదారు. వెంటాడి మరీ కార్మికులను కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా చావబాదారు.
లాఠీచార్జితో మనస్థాపం చెంది ఉష అనే మహిళా కండక్టర్ ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల లాఠీచార్జిని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఖండించారు.