సాక్షి, నెల్లూరు: ప్లాట్లు కొనేవారు లేక కుప్పకూలిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. లాభాపేక్షతో పచ్చటి పొలాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చిన వ్యాపారులు నిండా మునిగిపోయారు. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకున్న వ్యాపారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు లేఅవుట్లను పొలాలుగా మార్చేసుకుంటున్నారు. అప్పులు కట్టలేని పరిస్థితిలో వ్యాపారుల్లో కొందరు ఆత్మహత్యలకు తెగబడుతున్నారు.
వైఎస్సార్ హయాంలో రియల్‌భూమ్
మహానేత డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఆయన హయాంలో కృష్ణపట్నం పోర్టు, విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలు రావడంతో భూముల ధరలు భారీగా పెరి గాయి. ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరగడంతో వ్యాపారులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి లేఅవుట్లుగా మార్చి కోట్లు గడించారు. ఆ సమయంలో ముత్తుకూరు ప్రాంతంలో ఎకరా స్థలం కోటి రూపాయలకు పైగా పలికింది. నెల్లూరులోని మాగుంట లేఅవుట్, చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతా ల్లో ఎకరా ధర రూ.3 కోట్లు దాటింది. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పలువురు మధ్య తరగతి ప్రజలు అప్పులు చేసి లేఅవుట్లు వేయగా, మరికొందరు మారుబేరం చేసుకొవచ్చనే ఉద్దేశంతో ప్లాట్లకు అడ్వాన్స్‌లు కట్టారు.
ఒక్కసారిగా ఢమాల్
వైఎస్సార్ మరణంతో 2009 తర్వాత జిల్లాలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు నిలువునా మునిగిపోయారు. వీరిలో కొందరు అధిక వడ్డీలకు అప్పులు తేగా, మరికొందరు ఇంట్లో భార్యాపిల్లల నగలను తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఇలా తెచ్చిన అప్పులకు వడ్డీలు భారీగా పేరుకుపోతుండటంతో వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అప్పులు తీర్చలేక, సొంతూరిలో ముఖం చూపించలేక కొందరు వలసబాట పట్టారు. కొందరైతే అప్పులు చేసి మరీ వడ్డీలు కడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇటీవల నెల్లూరులోని బారాషహీద్ దర్గా ప్రాంతంలో ఓ వ్యాపారి, ఓ లాడ్జిలో ఇంకో వ్యాపారి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సందట్లో సడేమియా..
వ్యాపారం బాగున్న సమయంలో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములు, ఇరిగేషన్ కాలువలను లేఅవుట్లలో కలిపేసుకున్నారు. అప్ప ట్లో వాటిని కొనుగోలు చేసిన పలువురు ఇప్పుడు నిలువునా మోసపోయి గగ్గోలు పెడుతున్నారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బ్రోచర్లలో అన్నీ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ వాటిలో సగానికిపైగా లేఅవుట్లు అక్రమం కావడం గమనార్హం. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పంచాయతీల పరిధిలో వేసిన 774 లేఅవుట్లలో 560, మున్సిపాలిటీల పరిధిలో పదిహేను వం దల్లో 1,200 లేఅవుట్లు అక్రమమని తేలింది. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రుణా లు రాక ఇబ్బందులు పడుతున్నారు.
లేఅవుట్లలో పంటలు
వ్యాపారులు పూర్తి మొత్తంలో నగదు చెల్లించకపోవడంతో పలువురు రైతులు తమ భూముల్లో తిరిగి పంటల సాగు మొదలు పెట్టారు. కొంద రు వ్యాపారులు కూడా లేఅవుట్లను ఖాళీగా ఉం చుకోలేక వ్యవసాయం చేస్తున్నారు. నెల్లూరు శివారులోని కనుపర్తిపాడు, కల్లూరుపల్లి, పొట్టేపాళెం తదితర ప్రాంతాల్లోని లేఅవుట్లలో ఇప్పటికే వరిసాగులో ఉంది. మళ్లీ కొద్ది రోజుల త ర్వాతనైనా వ్యాపారం పుంజుకుంటుందనే ఆశ లో వ్యాపారులు ఉన్నారు.
లే అవుట్
Published Mon, Jan 20 2014 5:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement