
యువతిని ఒడ్డుకు తీసుకొస్తున్న లైఫ్‌గార్డులు
విశాఖపట్నం, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక యువతిని లైఫ్‌గార్డులు రక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన గొల్లపూడి జ్యోతి (20) సోమవారం ఆర్‌కేబీచ్‌కి వచ్చింది. తరువాత సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కరెటం ఉధృతికి కొట్టుకుపోయింది. ఇంతలో అప్రమత్తమైన లైఫ్‌గార్డులు ఎం.కృష్ణ, వి.పైడిరాజు, కె.రాజు గమనించి ఆ యువతిని రక్షించి ఒడ్డుకి సురక్షితంగా చేర్చారు. యువతికి ప్రాణాపాయం తప్పడంతో సందర్శకులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ యువతి లైఫ్‌గార్డులకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment