కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రం తిమ్మరాజుపేటలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం మధ్యాహ్నం దుకాణంపై దాడి చేశారు. ఎలాంటి సీళ్లు లేని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు.