టీచర్ల అక్రమ బదిలీలకు గంట
విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే కౌన్సెలింగు
విధానానికి విఘాతం
5మంది బదిలీలపై విద్యాశాఖ తిరస్కారం
సిఫార్సుల లేఖలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
విశాఖ రూరల్: విద్యా శాఖ మంత్రి ప్రాతి నిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ విధానాన్ని తుంగలో తొక్కారు. సీనియార్టీతో సంబంధం లే కుండా సి‘ఫార్సు’లకు పెద్ద పీట వేశారు. జిల్లా విద్యా శాఖతో సంబంధం లేకుం డా.. ఎటువంటి కౌన్సెలింగ్ చేయకుండా 49 మంది బదిలీలకు ‘గంట’ కొట్టారు. ఒకే స్థానాన్ని ఇద్దరు, ముగ్గురికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. ఖాళీలు లేని స్థానా ల్లో మరికొంత మందికి పోస్టింగ్‌లు కల్పించా రు. ఈ బదిలీలు జిల్లా విద్యా శాఖకు తలనొప్పిగా మారాయి. 49 మందికి బదిలీలు జరగగా 15 మంది ఉత్తర్వులను విద్యా శాఖ అధికారులు తిరస్కరించారు. సీనియార్టీ ప్రకారం బదిలీలు చేపట్టాలని 2000లో టీడీపీ ప్రభుత్వమే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ వి ధానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు జిల్లాలో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియను చేపట్టారు. కానీ ఈ ఏడాది ఆ విధానానికి టీడీపీ ప్రభుత్వమే తూట్లు పొడి చింది. ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించకుండా, సీనియార్టీని పట్టించుకోకుండా కేవ లం మంత్రుల సిఫార్సు లేఖలు ఆధారంగా ఇష్టానుసారంగా బదిలీ ఉత్తర్వు లు జారీ చేసినట్టు తెలిసింది. కౌన్సెలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేలా చూడాల్సిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆ విధానానికి మంగళం పాడటం విమర్శలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీనియార్టీ ప్రకారం నగర పరిధిలో పాఠశాలలకు బదిలీలు చేయాల్సి ఉంది.
కానీ ఏళ్లుగా నగర ంలో పనిచేస్తున్న వారికే మరో ఎనిమిదేళ్లు నగరంలో పనిచేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో రూరల్‌లో పనిచేస్తున్న టీచర్లకు అన్యాయం జరిగినట్లయింది. బదిలీలపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ విద్యా శాఖ మంత్రి కనీసం ఆ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. సాక్షాత్తు విద్యా శాఖ మంత్రే కొంత మందికి సిఫార్సులు లేఖలు ఇచ్చి కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచారని ఉపాధ్యాయులు ఆరోపణలు చేస్తున్నారు.
ఒకే స్థానంలో ముగ్గురు: అడ్డగోలు గా చేసిన బదిలీలు జిల్లా విద్యా శాఖ లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తోటగరువు పాఠశాలలో ఒకే స్థానానికి ముగ్గురు టీచర్లను బదిలీ చేశా రు. చింతల అగ్రహారం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల, హనుమంతవా క ఎంపీపీ పాఠశాలలకు ఒకే స్థానానికి ఇద్దరేసి ఉపాధ్యాయులకు బదిలీ లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 8 మందిని ఎటువంటి ఖాళీలు లేని స్థానాలకు బదిలీ చేశారు. జిల్లాలో అ డ్డగోలుగా 49 మందికి బదిలీ ఉత్తర్వులివ్వగా అందులో 15 మంది టీచ ర్ల ఉత్తర్వులను సక్రమంగా లేనట్లు విద్యా శాఖ అధికారులు గుర్తించారు. ఒకేస్థానానికి, ఖాళీలు లేని స్థానాలకు తెచ్చుకున్న ఆర్డర్లను మార్పించుకోవాలని సూచించారు. సీనియార్టీతో సం బంధం లేకుండా కేవలం పైరవీలనే అర్హతగా భావించి బదిలీలు చేయడం పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.