విజయవాడ మెట్రోకు రూ. 2600 కోట్ల రుణం
రూ.300 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ రూ.2600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. జర్మనీ ప్రతినిధుల బృందంతో నాలుగు రోజుల నుంచి జరుపుతున్న చర్చలు ఫలించాయని గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు విలువలో 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించనున్నదన్నారు. జర్మనీ రుణం విడుదలయ్యేలోపు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో భూసేకరణ చేపట్టనున్నామన్నారు.ప్రభుత్వ భవనాల సముదాయం మాస్టర్ ప్లాన్‌పై నార్మన్ ఫోస్టర్స్‌తో చర్చించేందుకు ఈనెల 22న సీఆర్‌డీఏ కమిషనర్‌తో కలసి లండన్ వెళుతున్నానని, 28వ తేదీన ఆ దేశ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్‌ను అందించనున్నారని తెలిపారు.