వేల్పూర్, న్యూస్‌లైన్ :వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాలలో గురువారం నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు గ్రామాలలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. కోమన్‌పల్లిలో దొనికెర నర్సుకు 385 ఓట్లు రాగా, 332 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి లక్ష్మీనర్సుకు 53 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతా ఇద్దరు అభ్యర్థులు గౌరమ్మకు 23, మోర్తా డ్ లక్ష్మికి 22 ఓట్లు వచ్చాయి. మూడు వార్డులకు జరిగిన ఎన్నికలో ర్యాడ నర్సయ్య, గుర్క గాయత్రి, మోర్తాడ్ మమత సభ్యులుగా గెలుపొందారు. గ్రామంలో 712 మంది ఓటర్లు ఉండగా, 507 ఓట్లు పోలయ్యాయి. 24 ఓట్లు చెల్లలేదు. 69.3 శాతం పోలింగ్ నమోదైంది. వెంకటాపూర్ సర్పంచ్‌గా ఎన్ని కైన ధన్‌రెక్కుల రవికి 564 ఓట్లు వచ్చాయి.
సమీప ప్రత్యర్థి ధన్‌రెక్కుల రా జేందర్‌కు 62 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రవికి 502 ఓట్ల మెజారిటీ లభించింది. మరో అభ్యర్థి పారం సుదర్శన్‌కు 76 ఓట్లు వచ్చాయి. 26 ఓట్లు చెల్లలేదు. ఉపసర్పంచ్‌గా ఏనుగు మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. మిగతా మూడు వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికలో రిక్కరంజిత్‌కుమార్, గొల్లపల్లి వెంకటేశ్, ధన్‌రెక్కుల రాజేశ్వర్‌లు గెలుపొందారు. 1016 మంది ఓటర్లుండగా, 728 ఓట్లు పోలయ్యాయి. 72 శాతం పోలింగ్ నమోదైంది. ఇన్‌చార్జి ఆర్డీవో శివలింగయ్య రెండు గ్రామాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. డీపీవో సురేస్‌బాబు మండల పరిషత్తు కార్యాలయానికి చేరుకొని పోలింగ్‌ను సమీక్షించారు