స్థానిక సంరంభం | Local Feast | Sakshi
Sakshi News home page

స్థానిక సంరంభం

Published Fri, Jun 27 2014 12:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

స్థానిక సంరంభం - Sakshi

స్థానిక సంరంభం

  • స్థానిక సంస్థలఎన్నికలకు ఏర్పాట్లు
  •      జూలై 3న  మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
  •      4న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఓటింగ్
  •      5న జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక
  •      జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవానికి చాన్స్
  •      39 ఎంపీపీల్లో 23 టీడీపీ, 12 వైఎస్‌ఆర్‌సీపీ  కైవసం
  •      నాలుగింటిలో హంగ్
  •      స్వతంత్రులే కీలకం
  • విశాఖ రూరల్ : ఎట్టకేలకు ‘స్థానిక’ పీఠాల అధిరోహణకు ముహూర్తం ఖరారైంది. అధికార పగ్గాలు చేట్టేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజాప్రతినిధులకు ఆ తరుణం రానేవస్తోంది. స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఎన్నికలను జూలై మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 3న పరీక్ష పద్దతిలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరగనుంది. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉంటుంది. జూలై 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
     
    రెండు మున్సిపాలిటీలు టీడీపీవే

    జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. యలమంచిలి  మున్సిపాలిటీలో 24 వా ర్డులు ఉండగా టీడీపీ 21 స్థానాలు దక్కించుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ మూడు వార్డుల్లో గెలిచింది. ఇక్క డ 2వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థిని పిళ్లా రమాకుమారి చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డులలో టీడీపీ 19, వైఎస్‌ఆర్‌సీపీ 6, కాంగ్రెస్ 1, సీపీఐ 1 వార్డులలో గెలుపొందాయి. ఇక్కడ 25వ వార్డు నుంచి విజయం సాధించిన చింతకాయల అనితకు చైర్‌పర్సన్ పదవి వరించనుంది. ఆమె భర్త చింతకాయల సన్యాసిపాత్రుడు వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. ఈయన మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు.
     
    జెడ్పీ చైర్‌పర్సన్‌గా భవాని : జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం 24 జెడ్పీటీసీలను, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 15 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. టీడీపీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాంబిల్లి మండలం నుంచి గెలిచిన లాలం భవానిని చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికలకు ముందే టీడీపీ ప్రకటించింది. జూలై 1న కలెక్టర్ ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై 5న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు చెతులు ఎత్తే విధానంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకుంటారు.
     
    రసవత్తరంగా ఎంపీటీసీ అధ్యక్ష ఎన్నికలు : మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు మాత్రం రసవత్తరంగా జరగనున్నాయి. జిల్లాలో 656 ఎంపీటీసీలలో రెండు వాయిదా పడగా 654 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 334 స్థానాలు, వైఎస్‌ఆర్‌సీపీ 254, కాంగ్రెస్ 17, సీపీఎం 5, సీపీఐ 3, బీజేపీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో గెలవగా, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. 39 మండల పరిషత్‌లలో 23 ఎంపీపీలను టీడీపీ, 12 ఎంపీపీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నాలుగు ఎంపీపీల విషయంలో హంగ్ ఏర్పడింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement