- రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
- అనాథలైన భార్యాపిల్లలు
మదనపల్లె క్రైం: వారు ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టారు. ఒకే వ్యాపారం చే స్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా కలిసి ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని మృత్యువు కాటేసింది. మరణంలోనూ ఇద్దరూ కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. హృ దయ విదారకమైన ఈ ఘటన ఆది వా రం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది.
మృతుల కుటుంబ సభ్యు లు, పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన నారాయణ ప్ప కుమారులు బుడ్డా వెంకట్రమణ(40), బుడ్డా నాగరాజు(35) కొయ్యల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాల ను పోషించుకుంటున్నారు. వెంకట్రమణకు భార్య భాగ్యమ్మ, కుమార్తె కళావతి(20), కుమారుడు అశోక్(18) ఉన్నా రు. నాగరాజుకు భార్య రాధమ్మ, కు మార్తె లక్ష్మి(12), కుమారులు అరుణ్‌కుమార్(5), అనిల్‌కుమార్(3) ఉన్నా రు. వ్యాపార పనుల నిమిత్తం వారు ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బ యల్దేరారు.
కంటేవారిపల్లె సమీపంలోని మలుపురోడ్డులో మదనపల్లె నుం చి అనంతపురం వైపు వెళుతున్న ఐషర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వెంకట్రమణ అక్కడికక్కడే మృతి చెం దాడు. నాగరాజు తీవ్ర గాయాలతో కొ ట్టుమిట్టాడుతుండగా స్థానికులు 108 లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికి త్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశా రు. మార్గమధ్యంలోనే నాగరాజు మృ తి చెందాడు. ఇద్దరి మృతదేహాలను మ దనపల్లె ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
విషయం తెలుసుకు న్న ఇరు కుటుంబాల వారు షాక్‌కు గు రయ్యారు. ‘మాకు అన్యాయం చేసి వెళ్లిపోయారా’ అంటూ రాధమ్మ, భాగ్య మ్మ బోరున రోదించడం పలువురిని కలిచివేసింది. బి.కొత్తకోట ఎంపీపీ, టీ డీపీ కార్యకర్తలు ఏరియా ఆస్పత్రికి చే రుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టా రు. ముదివేడు పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు. సోదరుల అంత్యక్రియలకు స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్ర ముఖులు తరలివచ్చారు. బాధితుల కు టుంబాలకు సానుభూతి తెలిపారు.