అనంతపురం మెడికల్: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులను ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల యజమానులు పక్కదారి పట్టిస్తున్నారు. సులువుగా పరీక్షలు పాస్ చేరుుస్తామని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు గుంజి యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్పత్రిలో చూచి రాతలకు తెరలేపారు.
నగర నడిబొడ్డున పేరు గొప్ప ఆస్పత్రిలో ఇంతగా మాస్ కాపీరుుంగ్ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో బుధవారం జరిగిన జీఎన్‌ఎం నర్సింగ్ మూడవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ జరుగుతోందని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంపై కొందరు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నిర్వాహకులు చిందులు తొక్కారు. తమను అడ్డుకునే వారే లేరంటూ గురువారం సైతం ఆస్పత్రి యాజమాన్యం, ఇన్విజిలేటర్ల ఆశీర్వాదంతో చూచి రాతలకు తెగబడ్డారు.
గురువారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు. లేబర్ వార్డులో ఇన్విజిలేటర్లు వైవాకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. వైవా ఒక్కొక్క విద్యార్థిని విడిగా అడగాలి. అలాంటిది గుంపుగా అందరినీ నిల్చోబెట్టి తూతూ మంత్రంగా కానిచ్చేశారు. రికార్డులను జావాబు పత్రం కింద పెట్టుకుని పరీక్ష హాలులోకి వెళ్లారు. చివరి సంవత్సరం ఎంతో పకడ్బందీగా జరపాల్సిన పరీక్షలను ఇలా నిర్వహించడాన్ని చూసి వైద్య విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాగైతే నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్విజిలేటర్ల వద్దే ప్రైవేట్ అధ్యాపకులు
ఎక్కడైనా పరీక్షలు జరిగితే ఆ దరిదాపుల్లో ఇతర కళాశాలల అధ్యాపక బృందం ఉండకూడదు. అటువంటిది పలు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు వారి విద్యార్థులకు సూచనలు, సలహాలిస్తూ అక్కడే తిష్ట వేశారుు.
ఇన్విజిలేటర్లతో లోపారుు కారి ఒప్పందం వల్లే ఇలా జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాల ప్రతినిధులు అడ్డుకున్నారు. ‘పిల్లలు ఏదో రాసుకుంటున్నారు రాసుకోనివ్వండి.. అవినీతి చాలా చోట్ల జరుగుతోంది.. ఈ పరీక్షలకు ఎందుకు అడ్డువస్తున్నార’ంటూ వాగ్వాదానికి దిగారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైన వారిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నగరాల్లో అనేక కళాశాలలున్నా, ‘అనంత’లో సులువుగా సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా ఉంటుందని అర్థమవుతోంది.
ఆర్‌ఎంఓకు తెలుసు
ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతికి పరీక్షల గురించి తెలుసు. ఇది వరకే నర్సింగ్ పరీక్షల బోర్డు నుంచి లేఖ వచ్చింది. ఉదయం పరీక్షల విధానాన్ని పరిశీలించాం. నిబంధనలు పాటించమని చెప్పాం.
- రాజేశ్వరి, నర్సింగ్ సూపరింటెండెంట్
నాకు సంబంధం లేదు
ఆస్పత్రిలో పరీక్షలు జరుగుతున్న విషయం నాకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ విభాగంతో సంబంధం లేదు. అకడమిక్ వైపు వారు చూసుకుంటారు. కొంత మంది నా పేరును వాడుకుంటున్నారు.
- డాక్టర్ వైవీ రావు. ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ
థియరీ మాత్రమే మా పరిధిలోకి
జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ థియరీ పరీక్షలు మాత్రమే మా పరిధిలోకి వస్తాయి. డీఎంఈ నిబంధనలు ఇవే. ప్రాక్టికల్స్ విషయం మాత్రం మా పరిధిలోకి రాదు. ఆ బాధ్యత సూపరింటెండెంట్‌దే.
- డాక్టర్ నీరజ, ప్రిన్సిపాల్, వైద్య కళాశాల, అనంతపురం
అకడమిక్ వారికే సంబంధం
జీఎన్‌ఎం పరీక్షలు అకడమిక్ వారికే సంబంధం. మాకు ఎటువంటి సంబంధం లేదు. స్థలం మాత్రం మేం ఏర్పాటు చేస్తాం. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించే బాధ్యత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌దే.
- డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్
మా పరీక్షలు.. మా ఇష్టం!
Published Fri, Dec 12 2014 2:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement