ప్రేమకు పట్టాభిషేకం..! | Love Coronation ..! | Sakshi
Sakshi News home page

ప్రేమకు పట్టాభిషేకం..!

Published Fri, Feb 14 2014 4:26 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

Love Coronation ..!

 ‘ప్రేమ’..దాని శక్తి అనంతం. అది చూపులతో మొదలై వలపు గీతాలు పలికించే సుస్వరాల వీణ.  ప్రకృతి సహజం. గుండెల్లో విప్లవం. పడుచు జంటలు మొదలు కొని...బోసి పళ్ల అవ్వా,తాతల వరకూ పట్టి నిలపగల ‘క్విక్‌ఫిక్స్’.అరనవ్వులు,కనుల బాసలు, త్యాగం, తన్మయత్వం, సర్దుబాటు, విరహం, మూతి విరుపులు,.. ఇలా ఎన్నెన్నో... ఈ కావ్యానికి వన్నెలద్దే మకుటాలు. అల్లుకుంటే...సీతారాములు,శివపార్వతులు, రాధాకృష్ణులను మించి పోయే రసాత్మక ఘట్టం. గిల్లుకుంటే..హృదయాలను బద్దలు చేసే..శషభిషలు. ఎడబాటు...తడబాటులతో చిరిగిపోయే చివరి అంకం. అందుకే ప్రేమకు నిత్యం  పట్టాభిషేకం.
 
 నిన్ను ప్రేమిస్తున్నానని...
 మార్కెట్‌లో ఆకర్షణీయ కానుకలు..!
  ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమ కానుకలు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఏటా కొనుగోలు దారుల అభిరుచులు మారుతుండటంతో అందుకు అనుగుణంగా ఆకర్షణీయమైన వస్తువులను అందుబాటులో ఉంచారు. ఇవి ప్రేమ పక్షుల మనసులను దోచేస్తున్నాయి.
 
 రాళ్లతో, సిల్వర్ పూతతో తయారు చేసిన జంట బొమ్మలు, ఐలవ్ యూ అంటూ పలికే.. విద్యుత్ పరికరాలు, లవ్ టెడ్డీబేర్,  ‘పత్తి’ హృదయాలు, పాలరాతి బొమ్మలు, అనాదిగా ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన హంసలు, రాధాకృష్ణుల బొమ్మలు, దీనితోపాటు లవ్ ఆకారంలో ఫొటో ఫ్రేమ్‌లు, వాచ్‌లు, సరిజోడు మనసును గెలవడానికి బహుమతుల కొనుగోలు చేసేందుకు ప్రేమికులు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో గిఫ్ట్ షాపులన్నీ ప్రేమ చిహ్నాలతో నిండిపోయి ప్రేమికులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. కళ్లు జిగేల్ మనిపించే రంగుల పూలు, టాయ్స్, ఫ్రేమ్‌లు, గ్రీటింగ్ కార్డులు, కీ ఛైన్లు, చాక్లెట్లు.. ఇలా ఎన్నో రకాల ప్రేమ ఉత్పత్తులు కొలువుదీరాయి.  భావుకత ఉట్టిపడే కొటేషన్లతో బహుమతులు కేక పుట్టిస్తున్నాయి. వీటి ధరలు సైజు, నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఉన్నాయని, ఏటా కొత్త కొత్త వస్తువులు విడుదల చేస్తున్న కారణంగా.. వాటి ధరల్లో కూడా మార్పులు ఉంటున్నాయని, కానుకలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోందని, ప్రేమికులే కాకుండా.. ఇతరులు సైతం ఆయా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని గిఫ్ట్ ఆర్టికల్స్ షాపు యజమాని చంద్రకాంత్ పేర్కొన్నారు.
 - న్యూస్‌లైన్, పాలమూరు
 
 హ్యాన్సీ...నా జీవన ఫ్యాన్సీ
 1988లో ఎంవీరామన్ ఆంగ్లమీడియం స్కూల్ ఆత్మకూర్‌లో ఏ ర్పాటు చేశారు. అక్కడికి ఆంగ్లభాసా బోధనకోసం కేరళానుంచి  ఉపాధ్యాయుల ను నియమించుకున్నాను. ఇం దులో హ్యాన్సీ అనే అమ్మాయితో అప్పటికి ఆరేళ్లుగా ఏర్పరచుకున్న స్నేహం ప్రేమగా మా రింది. కులాలు వేరని..మా పెళ్లికి  కుటుంబ సబ్యులు ఏకగ్రీ వంగా నో చెప్పారు. అయినా 1996లో ఆమెను పెళ్లిచేసుకు న్నా.  నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య అన్యోన్యత పె రి గిందే తప్పా తరగలేదు. మాకు జీవితాన్నిస్తున్న పాఠశాల ను ఇరువురమూ ముందుకు తీసుకెళ్లి గర్వంగా బతుకుతున్నాం.                
 -శ్రీధర్ గౌడ్,
 ఎంవీరామన్ స్కూల్ కరస్పాండెంట్ , ఆత్మకూర్
 
 పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం
 ప్రేమ పెళ్లికి వ్యతిరేకంగా కు టుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినా దాం పత్య జీవితానికి ఇరువురి భావాలు ఏకం అయ్యాయి. దీంతో స్నేహితుల సహ కా రంతో బీచుపల్లి ఆంజేయస్వామి ఆల యంలో 13ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం అమరచింత గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం.        
 - తిరుమలేష్, అమరచింత.
 
 ప్రేమ పెళ్లితో స్థిరపడ్డాం...
 పాఠశాలలో ఏర్పడ్డ పరిచ య ం ప్రే మగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకొని వైవాహిక జీవితానికి శ్రీకా రం చుట్టాం. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. నా భార్య  ఆత్మకూర్ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement