greeting cards
-
సింపుల్ & స్వీట్
ఖరీదైన గిఫ్ట్లలోనే ప్రేమ ఉండదు. ప్రేమ గొప్పతనం అదే కదా! సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో ప్రేమకానుకలు ఇవ్వడానికి మార్కెట్లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. మచ్చుకు కొన్ని... ► హార్ట్ షేప్డ్ మగ్స్, హార్ట్ పేష్డ్ చాక్లెట్స్ ► 365 లవ్ మెసేజ్‌లు, తియ్యటి టోఫీలతో కూడిన జార్ ► రొమాంటిక్ గ్రీటింగ్ కార్డ్స్ ► వాలంటైన్స్ డే క్రిస్టల్ మెమెంటో ► ఫ్లోటింగ్ హార్ట్స్ గ్లాస్ఫ్రేమ్స్ ► ‘ఇట్ వాజ్ ఆల్వేస్ యూ’ ఫొటోపోస్టర్ ► రొటేటింగ్ పర్సనలైజ్డ్ పెన్ స్టాండ్ ► మెటల్ ఫొటో కీచైన్ ► వుడెన్ పర్సనలైజ్ జిగ్సా పజిల్ ►లవ్ నెవర్ ఎండ్స్ ఫ్రేమ్ ► లవ్ సర్టిఫికెట్ విత్ ఫ్రేమ్ టెక్సావి అయితే... ► ఫుజీ ఫిల్మ్ ఇన్స్టాక్స్ మినీ–11 కంపాక్ట్ ఇన్స్టంట్ కెమెరాతో క్రెడిట్–కార్ట్ సైజ్‌లో ఫొటోలు తీసుకోవచ్చు ► బిసైడ్ ల్యాంప్: మన వాయిస్‌తో రకరకాల రంగులను ఇల్లంతా వెదజల్లుతుంది ► రక రకాల హెయిర్‌స్టైల్స్‌ను ఇష్టపడే వారి కోసం: డైసన్ ఎయిర్‌రాప్ ► వీడియో గేమ్ ప్రేమికుల కోసం... ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ కన్సోల్, లాగిటెక్ ఎ30 గేమింగ్ హెడ్సెట్ ► సంగీత ప్రేమికుల కోసం... జేబియల్ మినీబ్లూ స్పీకర్, అమెజాన్ ఎకో స్టూడియో స్పీకర్, శాంసంగ్ ఎంఎక్స్–ఎస్టీ 40బీ సౌండ్ టవర్ ► సెల్‌ఫోన్‌లోని మీ విలువైన జ్ఞాపకాల ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్ తీసుకోవడానికి... హెచ్‌పీ స్ప్రోకెట్పోర్టబుల్ ప్రింటర్ -
బ్రిటన్ రాణి చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది. సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్‌కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యారు. 80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
కిమ్.. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారిలా..
సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా లేఖల ద్వారా తెలిపారు. కష్టకాలంలో తనను నమ్మి, మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సరంలో వారికి ఆనందం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అధ్యక్షుడు రాసిన 2.5 కోట్ల లేఖలను ఇప్పటివరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కిమ్ ఏటా దేశ ప్రజలనుద్దేశించి టీవీలో ప్రసంగించడం ఆనవాయితీ. 1995 తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలపడం ఇదే ప్రథమం. -
కొత్త సంవత్సరంలో వాటి ఉనికి కనుమరుగు
సాక్షి, కెరమెరి(ఆసిపాబాద్): కొత్త సంవత్సరం వస్తోందంటే వారం పది రోజుల ముందు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో గ్రీటింగ్‌కార్డులు, రంగుల దుకాణాల వద్ద సందడి నెలకొని ఉండేది. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రీటింగ్‌కార్డులు కొనుగోలు చేసి వారం ముందే పోస్టుల్లో పంపేవారు. అందుబాటులో ఉన్నవారికి స్వయంగా ఇచ్చేవారు. గ్రామీణప్రాంతాల్లో హీరో, హీరోయిన్ల ఫొటోలతో కూడిన గ్రీటింగ్స్‌కు మంచి గిరాకీ ఉండేది. నచ్చిన హీరో, హీరోయిన్ల ఫొటోలను మార్చుకుంటూ చిన్నారులు సంబురంగా గడిపేవారు. కానీ.. నేడు పరిస్థితి మారింది. గ్రీటింగ్‌కార్డులు కనుమరుగయ్యాయి. వాటికి గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు కూడా వాటి వైపు కన్నెత్తిచూడడం లేదు. కొత్తొక వింత.. కొత్తొక వింత.. అన్నచందంగా ఆత్మీయులను కలిసి శుభాకాంక్షలు తెలుపుకునే అలవాటు నుంచి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా క్షణాల్లో శుభాకాంక్షలు తెలుపుకునే సాంకేతిక పరిజ్ఞానం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈ మెయిల్స్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. సందేశాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంటర్నెట్లో విభిన్నరకాల గ్రీటింగ్ స్టిక్కర్లతో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ట్రెండ్ మార్చిన సెల్పోన్లు.. సెల్ఫోన్ల ప్రవేశంతో పాతట్రెండ్ మారింది. మెసేజ్‌లతో మొదలు.. ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. గతంలో వేడుకలు ఎక్కడో ఓ చోట.. అన్నట్లు చేసుకునేవారు. ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. కాలనీలు మొదలుకుని.. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్‌లు కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కాలంతోపాటు ఆధునిక పోకడలూ రంగప్రవేశం చేశాయి. సమయాభావం వల్ల యువత ఆత్మీయ సంభాషణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒక్క క్లిక్‌తో ఆత్మీయ, మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జ్ఞాపకాలుగానే పాత రోజులు పాతకాలంలో కార్డుల ద్వారా గ్రీటింగ్ తెలుపుకునేవాళ్లం. వారం ముందు నాకు మిత్రులు పోస్టుకార్డు ద్వారా గ్రీటింగ్ పంపేవారు. దగ్గరున్న వారికి స్వయంగా శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్లం. ఇప్పుడు గ్రీటింగ్కార్డులకు గిరాకీ బాగా తగ్గింది. – కోటగిరి, సత్తయ్య, కెరమెరి ఇంటర్నెట్ ద్వారానే గ్రీటింగ్ ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. నిత్యం మిత్రులు, బంధువులతో చాటింగ్‌లు ఉంటాయి. సందర్భం ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఫేస్బుక్ ద్వారానే కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే నూతన వత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఎన్నో రకాలైన గ్రీటింగ్స్, స్టిక్కర్స్లను డౌన్లోడ్ చేశాం. – పురి రమేశ్, కెరమెరి -
బి ఫ్యాక్టరీ
బర్త్‌డే, పెళ్లి, యానివర్సరీ... అకేషన్ ఏదైనా గిఫ్ట్ కంపల్సరీ. నలుగురిలో నారాయణలా కాకుండా... ఆ గిఫ్ట్ సంథింగ్ స్పెషల్ ఉండాలంటే... జస్ట్ స్టెప్ ఇన్ టూ ‘బి ఫ్యాక్టరీ’. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10లో ఉన్న ‘బి ఫ్యాక్టరీ’ స్పెషల్ అకేషన్ గిఫ్ట్స్ స్పెషలిస్ట్. మీ ఫ్రెండ్స్ లేదా బంధువుల అభిరుచులు చెబితే చాలు... అందుకు అనుగుణంగా గిఫ్ట్స్ రెడీ చేస్తుంది. క్రిస్టల్ ట్రెస్, ఫొటో బొకేస్, బాక్స్‌లు, చేతితో ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, సర్టిఫికేట్స్... ఇలా మీ మనసుకు దగ్గరగా ఉండేలా డిజైన్ చేస్తుంది. బేబీ షవర్స్, బ్రైడల్ షవర్స్, నవరాత్రి పూజ... ఇలా మీ అకేషన్స్‌కు తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్స్‌ని, గిఫ్ట్ బాగ్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. పెళ్లిబట్టలు పెట్టే ప్రజెంటేషన్ ట్రేస్, స్వీట్స్, చాక్లెట్స్ ప్యాక్ చేసే బాక్స్‌లు కూడా ఇక్కడ దొరుకుతాయి. చిన్న చిన్న వేడుకలు, పార్టీల్లో డెకరేషన్స్ కూడా చేస్తుంది. వివరాలకు 9502723718లో సంప్రదించొచ్చు, లేదా www.facebook.com/ thebfactory లో చూడొచ్చు. -
ప్రేమకు పట్టాభిషేకం..!
‘ప్రేమ’..దాని శక్తి అనంతం. అది చూపులతో మొదలై వలపు గీతాలు పలికించే సుస్వరాల వీణ. ప్రకృతి సహజం. గుండెల్లో విప్లవం. పడుచు జంటలు మొదలు కొని...బోసి పళ్ల అవ్వా,తాతల వరకూ పట్టి నిలపగల ‘క్విక్ఫిక్స్’.అరనవ్వులు,కనుల బాసలు, త్యాగం, తన్మయత్వం, సర్దుబాటు, విరహం, మూతి విరుపులు,.. ఇలా ఎన్నెన్నో... ఈ కావ్యానికి వన్నెలద్దే మకుటాలు. అల్లుకుంటే...సీతారాములు,శివపార్వతులు, రాధాకృష్ణులను మించి పోయే రసాత్మక ఘట్టం. గిల్లుకుంటే..హృదయాలను బద్దలు చేసే..శషభిషలు. ఎడబాటు...తడబాటులతో చిరిగిపోయే చివరి అంకం. అందుకే ప్రేమకు నిత్యం పట్టాభిషేకం. నిన్ను ప్రేమిస్తున్నానని... మార్కెట్లో ఆకర్షణీయ కానుకలు..! ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమ కానుకలు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఏటా కొనుగోలు దారుల అభిరుచులు మారుతుండటంతో అందుకు అనుగుణంగా ఆకర్షణీయమైన వస్తువులను అందుబాటులో ఉంచారు. ఇవి ప్రేమ పక్షుల మనసులను దోచేస్తున్నాయి. రాళ్లతో, సిల్వర్ పూతతో తయారు చేసిన జంట బొమ్మలు, ఐలవ్ యూ అంటూ పలికే.. విద్యుత్ పరికరాలు, లవ్ టెడ్డీబేర్, ‘పత్తి’ హృదయాలు, పాలరాతి బొమ్మలు, అనాదిగా ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన హంసలు, రాధాకృష్ణుల బొమ్మలు, దీనితోపాటు లవ్ ఆకారంలో ఫొటో ఫ్రేమ్‌లు, వాచ్‌లు, సరిజోడు మనసును గెలవడానికి బహుమతుల కొనుగోలు చేసేందుకు ప్రేమికులు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో గిఫ్ట్ షాపులన్నీ ప్రేమ చిహ్నాలతో నిండిపోయి ప్రేమికులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. కళ్లు జిగేల్ మనిపించే రంగుల పూలు, టాయ్స్, ఫ్రేమ్‌లు, గ్రీటింగ్ కార్డులు, కీ ఛైన్లు, చాక్లెట్లు.. ఇలా ఎన్నో రకాల ప్రేమ ఉత్పత్తులు కొలువుదీరాయి. భావుకత ఉట్టిపడే కొటేషన్లతో బహుమతులు కేక పుట్టిస్తున్నాయి. వీటి ధరలు సైజు, నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఉన్నాయని, ఏటా కొత్త కొత్త వస్తువులు విడుదల చేస్తున్న కారణంగా.. వాటి ధరల్లో కూడా మార్పులు ఉంటున్నాయని, కానుకలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోందని, ప్రేమికులే కాకుండా.. ఇతరులు సైతం ఆయా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని గిఫ్ట్ ఆర్టికల్స్ షాపు యజమాని చంద్రకాంత్ పేర్కొన్నారు. - న్యూస్‌లైన్, పాలమూరు హ్యాన్సీ...నా జీవన ఫ్యాన్సీ 1988లో ఎంవీరామన్ ఆంగ్లమీడియం స్కూల్ ఆత్మకూర్‌లో ఏ ర్పాటు చేశారు. అక్కడికి ఆంగ్లభాసా బోధనకోసం కేరళానుంచి ఉపాధ్యాయుల ను నియమించుకున్నాను. ఇం దులో హ్యాన్సీ అనే అమ్మాయితో అప్పటికి ఆరేళ్లుగా ఏర్పరచుకున్న స్నేహం ప్రేమగా మా రింది. కులాలు వేరని..మా పెళ్లికి కుటుంబ సబ్యులు ఏకగ్రీ వంగా నో చెప్పారు. అయినా 1996లో ఆమెను పెళ్లిచేసుకు న్నా. నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య అన్యోన్యత పె రి గిందే తప్పా తరగలేదు. మాకు జీవితాన్నిస్తున్న పాఠశాల ను ఇరువురమూ ముందుకు తీసుకెళ్లి గర్వంగా బతుకుతున్నాం. -శ్రీధర్ గౌడ్, ఎంవీరామన్ స్కూల్ కరస్పాండెంట్ , ఆత్మకూర్ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం ప్రేమ పెళ్లికి వ్యతిరేకంగా కు టుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినా దాం పత్య జీవితానికి ఇరువురి భావాలు ఏకం అయ్యాయి. దీంతో స్నేహితుల సహ కా రంతో బీచుపల్లి ఆంజేయస్వామి ఆల యంలో 13ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం అమరచింత గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. - తిరుమలేష్, అమరచింత. ప్రేమ పెళ్లితో స్థిరపడ్డాం... పాఠశాలలో ఏర్పడ్డ పరిచ య ం ప్రే మగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకొని వైవాహిక జీవితానికి శ్రీకా రం చుట్టాం. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. నా భార్య ఆత్మకూర్ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించారు. -
న్యూ జోష్
పండగలెన్ని వచ్చినా... న్యూ ఇయర్కుండే ప్రత్యేకతే వేరు. భేదం లేకుండా అంతా కలిసి చేసుకునే పండగ ఇది. ఇళ్ల ముందు ఆడపడుచుల సందడి... రోడ్లపై కుర్రకారు కేరింతలు... వారికి తగ్గట్టే నగరం కొత్తగా ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వచ్చిందంటే చాలు అందరిలో ‘నూతన’ ఉత్సాహం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పరిస్థితి ఎలా ఉన్నా... రాత్రి అవుతోందంటే ఎక్కడ చూసినా సందడే. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలైతే నూతన సంవత్సరంలోకి వెళుతున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిది. కేక్‌లు కట్‌చేసి, టపాసులు కాల్చి.. స్వీట్లు పంచి.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం గొప్ప అనుభూతి. - రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ పూలు మిలమిలమెరిసేనని... ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు, అలాగే పెద్ద తరహా వారు తమ ఆత్మీయులు, బంధువులకు... రాజకీయ నాయకులు తమ సహ నాయకులు...ఇతరులకు పుష్పగుచ్ఛాలు, పండ్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వ్యాపారులు వివిధ ఆకృతుల్లో... అందమైన పూలతో ఆకట్టుకునేలా అలంకరిస్తారు. బెంగళూర్... ఊటి ఇతర సుదూర ప్రాంతాల నుంచి వీటిని కొనుగోలు చేసి ఇక్కడ అందంగా తయారు చేసి విక్రయిస్తుంటారు. బొకే సైజు, రకాన్ని బట్టి రూ. 200 నుంచి రూ. ఐదు వేల వరకూ ఉన్నాయి. ఇక పండ్ల సంగతి చెబితే అమ్మో అంటారు. ఒక్క ఆపిల్ ధర రూ. 25 ఉంది. బత్తాయి కూడా దాదాపు అదే రేంజ్లో ఉంది. మనసులోని భావాలకు రూపం గ్రీటింగ్స టెక్నాలజీ మారుతున్నా క్వాలిటీ ఉన్న గ్రీటింగ్ కార్డ్సకు ఆదరణ తగ్గలేదు. మనసులోని భావాలను ఎదుట వ్యక్తికి చెప్పేందుకు మంచి మంచి కొటేషన్సతో గ్రీటింగ్ కార్డ్స రూపొందించారు. రూ. 10 నుంచి రూ. ఐదు వేల పైబడి ధర వరకూ ఉన్నాయి. ప్రింటింగ్ కార్డులతో పాటు సంగీతం వినిపించే కార్డులు అందుబాటులో ఉన్నాయి. కెవ్వు‘కేక్’ 2014కు ఆహ్వానం పలుకుతూ వెరైటీ కేక్‌లు కేక పుట్టిస్తున్నాయి. బేకరీలన్నీ బిజిబిజీగా ఉన్నాయి. కూల్ కేక్, చాక్లెట్, ఫ్రూట్, హాట్ అంటూ పలు విధాలైన వాటిని ఆకర్షణీయంగా తయారు చేశాయి. రకాన్ని బట్టి రూ.75 నుంచి రూ. 150 వరకూ అంతకంటే ఎక్కువ ధరల్లో కూడా లభిస్తున్నాయి. -
గ్రీటింగ్ కార్డ్: చైనా టు ఇంటర్నెట్
ఆవిష్కరణం మంచి సందేశాలను రాతప్రతిపై చెప్పుకునే చైనీయుల అలవాటు నుంచి గ్రీటింగ్ కార్డులు పుట్టాయి. చైనీయులు వీటిని కొత్త ఏడాదికే ఉపయోగించారు. 15వ శతాబ్దంలో హ్యాండ్ మేడ్ పేపరుపై తయారుచేసిన గ్రీటింగ్‌లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. 1850 నాటికి ఇది ఒక పాపులర్ కల్చర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగాక మరింత ప్రాచుర్యం లభించింది. ఇదేసమయంలో వీటి స్పూర్తితో క్రిస్మస్ కార్డులు పుట్టుకువచ్చాయి. ఆ తర్వాత వీటి ప్రచురణకు ప్రత్యేక కంపెనీలు వచ్చాయి. ఇవి ప్రత్యేకంగా చిత్రకారులను నియమించుకుని కొత్తకొత్త డిజైన్లతో మార్కెట్లోకి వదలడంతో ఇవి బాగా పేరొందాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగాక ఇవి వర్చువల్ గ్రీటింగ్ కార్డులుగా మారి జనాదరణను పొందుతున్నాయి. ఆహ్వానం పాఠకులకు : మీ చిట్టిపొట్టి చిన్నారుల ముద్దుముద్దు మాటలు, ముచ్చట్లు... మీ జీవితంలోని అనుభవాలు, అనుభూతులు... సామాజిక పరిణామాలపై మీ అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు... మాకు రాసి పంపండి. బాగున్న వాటిని ప్రచురిస్తాం. పాఠకులు, కార్టూనిస్టులు కూడా... మంచి కథలకు మనసారా నవ్వించే కార్టూన్లకు ప్రాధాన్యం ఉంటుంది కనుక వెంటనే మీ కథలు, కార్టూన్లు మాకు పంపండి. - ఎడి టర్, ఫీచర్స్ -
ఆన్లైన్ శుభాకాంక్షలు
బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముసలి వరకు నేడు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అరుుతే.. నెట్వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్పోన్ల వినియోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెకన్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రారుుతీలు ఇస్తున్నారుు. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అరుు్యందంటే నమ్మాల్సిందే. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు సరికదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది. విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్నెట్లో కదలాడుతూనే ఉన్నారుు. పలువురు సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. అనేక వెబ్సైట్లు.. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్ఎంఎస్, అల్టూ, ఎస్ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాలు వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ వున్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా.. నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్స్ విక్రరుుంచే వారు. రూపారుు నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థిని, విద్యార్థులు, యువతి, యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూరుు. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు. ఆన్లైన్లోనే శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ తరుణంలో గ్రీటింగ్ కార్డులపై క్రేజీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్న యువతీయువకులు తమ సెల్ఫోన్ల ద్వారా ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయరే కాదు అన్ని ప్రత్యేకతలు కలిగిన రోజులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి భావాలను వివిధ కోణాల్లో చాటుతున్నారు. -
ఆన్లైన్లో..హ్యాపీ న్యూ ఇయర్
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలంటే ఒకప్పుడు.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డులు కొనుగోలు చేసి పోస్ట్‌లో పంపేవారం. దగ్గరి ప్రాంతాల్లో ఉన్న వారికి స్వయంగా వెళ్లి గ్రీటింగ్ కార్డు అందజేసి శుభాకాంక్షలు చెప్పేవారం. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని జిల్లావాసులు అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది క్షణాల్లో విషెష్ వారి దరి చేరుతున్నారుు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం దాటి ఇతర దేశాలకూ తమ సందేశాలను పంపిస్తున్నారు. లాప్టాప్ నుంచి కంప్యూటర్.. కంప్యూటర్ నుంచి అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆన్డ్రారుుడ్ ఫోన్ల వరకూ అందుబాటులోకి వచ్చారుు. ఇంకేముంది యువత మాత్రమే కాదు.. వయో పరిమితి లేకుండా ఎవరుపడితే వారు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. - న్యూస్‌లైన్, భువనగిరి ఎస్ఎంఎస్ ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్స్.. బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముదుసలి వరకు నేడు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అరుుతే.. నెట్వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్పోన్ల విని యోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెక న్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రారుుతీలు ఇస్తున్నారుు. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అరుు్యందంటే నమ్మాల్సిందే. ఇంటర్నెట్లో శుభాకాంక్షలు.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు కదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది. విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్నెట్లో కదలాడుతూనే ఉన్నారుు. సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న పలువురు విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. అనేక వెబ్సైట్లు.. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్ఎంఎస్, ఆల్టూ, ఎస్ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాల వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ ఉన్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. అరచేతిలో ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్.. సెల్ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లే కాదు.. ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్‌తో కూడా వివిధ రకాల్లో శుభాకాంక్షలు పంపుకునేలా అవకాశాలు వచ్చాయి. మెస్సేజ్‌లే కాదు వాట్సప్, వీచాట్, వైపర్లాంటి అ ప్లికేషన్లు అందుబాటులో ఉన్నారుు. నేడు యువతీయువకులు విద్యార్థులు వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితో అద్భుత రకాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు అలాగే కొం గొత్త ఆలోచనలతో అనేక అప్లికేషన్ల ద్వారా.. మనస్సును దోచే చిత్రాలతో విషెష్ తెలుపుకోవచ్చు. తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా.. నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్‌కార్డు లు విక్రరుుంచే వారు. రూపారుు నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూరుు. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు. 200 గ్రీటింగ్‌కార్డులు కూడా అమ్మలేదు ఈ సీజన్లో ఇప్పటి దాకా 200 గ్రీటిం గ్కార్డులు కూడా అమ్మలేదు. నాలుగైదేళ్ల క్రితం కొత్త సంవత్సరం వచ్చిం దంటే చాలు గ్రీటిం గ్ కార్డులకోసం చాలామంది వచ్చేవా రు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. -భార్గవి, భువనగిరి -
ఊరూవాడా క్రిస్మస్ సందడి
= క్రిస్మస్ ట్రీ, పశువుల పాక ల ఏర్పాటు = క్రిస్మస్ తాత ఆశీర్వచనాల కోసం ఎదురు చూపులు అందాల తార... అరుదెంచె నాకై.... అంబరవీధిలో.. అని పాడుకుంటూ క్రీస్తు విశ్వాసులు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు. మానవాళి క్షేమం కోసం శిలువపై తన రక్తాన్ని చిందించిన కరుణామయుని కరుణ కోసం ధ్యానిస్తున్నారు. మచిలీపట్నం/ఈడేపల్లి/చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. క్రీస్తు విశ్వా సులు ప్రధాన కూడళ్లలో భారీ నక్షత్రాలను ఏర్పాటుచేసి, వాటికి విద్యుత్ వెలుగులు అద్దుతున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏసు పుట్టుకును తెలిపే పశువుల పాక నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. చర్చిలను ఇప్పటికే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రీటింగ్ కార్డులు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్తు పుట్టుకే క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జననం ప్రపంచగమనాన్నే మార్చింది. క్రీస్తు పుట్టుకను ఆధారంగాచేసుకుని కాలాన్ని క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంగా పరిగణిస్తున్నారు. భగవంతుడు తనను తాను తగ్గిం చుకుని ఇజ్రాయేలు దేశం, బెత్లెహేంలోని పశువుల పాకలో సామాన్య మానవుడిలా రెండువేల ఏళ్లకు పూర్వం జన్మిం చిన రోజునే క్రిస్మస్‌గా జరుపుతున్నారు. 33 ఏళ్లు జీవించి మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే శిలువపై అర్పించి, పునరుత్థానుడైన ఏసును లోక రక్షకుడిగా కొలుస్తున్నారు. తన భోధనల ద్వారా ప్రేమతత్వాన్ని, సోదరభావాన్ని అలవరచి, ప్రజలు ఆధ్యాత్మికపథం వైపు పయనించేలా క్రీస్తు కృషిచేశారు. క్రిస్మస్ సందర్భంగా వివిధ చర్చిల్లో ఆచరించే విధానం వేర్వేరుగా ఉంటుంది. క్రీస్తు జననాన్ని గుర్తుకు తెస్తూ చిన్నారులు ప్రదర్శించే నాటికలు, క్రిస్మస్తాత ఇచ్చే బహుమతులు, చర్చిల్లో క్రీస్తు జన్మించిన పశువుల పాక, అందులో బాలఏసు, ముగ్గురు జ్ఞానుల రాక, క్రీస్తు జననాన్ని ముందునుంచి చెబుతూ వస్తున్న గాబ్రియేలు దేవదూత, క్రీస్తు జననాన్ని చాటుతూ ఆకాశంలో ప్రత్యక్షమైన వేగుచుక్క(స్టార్), గొర్రెల కాపరుల హడావుడిని చాటుతూ చర్చిల్లో పశువుల పాకలను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఈవ్ సందర్భగా ఏటా డిసెంబర్ 24 తేదీ రాత్రి 10 గంటల నుంచి చర్చిలో ప్రార్థనలు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతాయి. 24న రాత్రి 12 గంటలకు భక్తులు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ అన్ని వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభువు రాక కోసం సమాయత్తం క్రీస్తును నమ్మినవారికి ఇదోక శుభదినం. ప్రభువు రాక కోసం క్రిస్మస్కు నెల మందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాపవిమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహారాజుగా ఈ లోకంలో జన్మించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నాం. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి. - రెవరెండ్ ఫాదర్ బుర్రి జాన్‌పీటర్ ఆర్సీఎం చర్చి, చల్లపల్లిమండలం, లక్ష్మీపురం