సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా లేఖల ద్వారా తెలిపారు. కష్టకాలంలో తనను నమ్మి, మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సరంలో వారికి ఆనందం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అధ్యక్షుడు రాసిన 2.5 కోట్ల లేఖలను ఇప్పటివరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కిమ్ ఏటా దేశ ప్రజలనుద్దేశించి టీవీలో ప్రసంగించడం ఆనవాయితీ. 1995 తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలపడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment