గ్రీటింగ్ కార్డ్: చైనా టు ఇంటర్నెట్ | greeting card : china to internet | Sakshi
Sakshi News home page

గ్రీటింగ్ కార్డ్: చైనా టు ఇంటర్నెట్

Published Sun, Dec 29 2013 1:41 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

greeting card : china to internet

 ఆవిష్కరణం

 మంచి సందేశాలను రాతప్రతిపై చెప్పుకునే చైనీయుల అలవాటు నుంచి గ్రీటింగ్ కార్డులు పుట్టాయి. చైనీయులు వీటిని కొత్త ఏడాదికే ఉపయోగించారు. 15వ శతాబ్దంలో హ్యాండ్ మేడ్ పేపరుపై తయారుచేసిన గ్రీటింగ్‌లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. 1850 నాటికి ఇది ఒక పాపులర్ కల్చర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగాక మరింత ప్రాచుర్యం లభించింది. ఇదేసమయంలో వీటి స్పూర్తితో క్రిస్‌మస్ కార్డులు పుట్టుకువచ్చాయి. ఆ తర్వాత వీటి ప్రచురణకు ప్రత్యేక కంపెనీలు వచ్చాయి. ఇవి ప్రత్యేకంగా చిత్రకారులను నియమించుకుని కొత్తకొత్త డిజైన్లతో మార్కెట్లోకి వదలడంతో ఇవి బాగా పేరొందాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగాక ఇవి వర్చువల్ గ్రీటింగ్ కార్డులుగా మారి జనాదరణను పొందుతున్నాయి.
 
 ఆహ్వానం
 పాఠకులకు :
 
 మీ చిట్టిపొట్టి చిన్నారుల
 ముద్దుముద్దు మాటలు, ముచ్చట్లు...
 మీ జీవితంలోని
 అనుభవాలు, అనుభూతులు...
 సామాజిక పరిణామాలపై
 మీ అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు...
 మాకు రాసి పంపండి.
 బాగున్న వాటిని ప్రచురిస్తాం.
 
 పాఠకులు,
 కార్టూనిస్టులు కూడా...
 మంచి కథలకు
 మనసారా నవ్వించే కార్టూన్‌లకు  ప్రాధాన్యం ఉంటుంది కనుక
 వెంటనే మీ కథలు, కార్టూన్లు
 మాకు పంపండి.
 
 - ఎడి టర్, ఫీచర్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement