తిరుపతిలో పెళ్లిని అడ్డుకున్న ప్రియుడిపై దాడి! | Lover attacked by bride family in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పెళ్లిని అడ్డుకున్న ప్రియుడిపై దాడి!

Published Tue, Jul 8 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

Lover attacked by bride family in tirupati

తిరుపతి : తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహాం జరిపించడాన్ని అడ్డుకోవడంతో తిరుపతిలోని పరకాల మఠంలో గందరగోళం నెలకొంది. ప్రేమించిన యువతికి వేరొక వ్యక్తితో వివాహం జరుపుతున్నారని ప్రియుడు అడ్డుకున్నాడు. 
 
అయితే పెళ్లిని అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేక ప్రియుడిపై పెళ్లి కూతురు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ప్రియుడిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పరకాళ మఠంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement