మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడంపై గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏడాదిలో మూడోసారి ధర పెంచడా న్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రజా సంఘాలు, వి ద్యార్థి సంఘం ఆందోళనకు ఉపక్రమించాయి. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వైఫల్యం నిరుపేద ప్రజలకు ఆర్థిక భారంగా మారిందని ఐఆర్‌సీపీ రాష్ట్ర కో కన్వీనర్ జయరావు అన్నా రు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ మేకల శ్రీనివాస్, నాయకులు చాంద్, రాజేశ్, మధు, శ్రీనివాస్, తాజ్, మల్లేశ్, సదీ, లక్ష్మణ్, మల్లేశ్, లచ్చన్న, రమేశ్, సుజాత పాల్గొన్నారు. అలాగే గ్యాస్ ధరను తగ్గించాలని కోరుతూ పీడీఎస్ యూ (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం) ఆధ్వర్యంలో ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో జరిగింది. రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని నినాదాలు చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయూలని డి మాండ్ చేశారు. నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, రాజు, తిరుపతి, నగేశ్, సమ్మయ్య పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో..
మంచిర్యాల టౌన్ : సబ్సిడీ గ్యాస్ ధర పెంపుపై బీజేపీ మహిళా మోర్చ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని జేఏసీ దీక్షా శిబిరం వద్ద గ్యాస్ బండ భారమైందని తెలియజేసేలా కట్టెలతో వంటలు చేస్తూ నిరసన తెలిపారు. బీజేపీ మహిళా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బోకుంట ప్రభ మాట్లాడుతూ, కొత్త సంవత్సరం రోజునే కేంద్రం సబ్సిడీ గ్యాస్ ధరను పెంచుతూ వెంటనే అమలు చేయడం దారుణమన్నారు. పెంచిన సబ్సిడీ గ్యాస్ ధర తగ్గించే వరకు బీజేపీ మహిళలు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు వినోద, పట్టణ అధ్యక్షురాలు స్వరూప, 17వ వార్డు అధ్యక్షురాలు ఎస్.లక్ష్మి, నాయకులు అల్లాడి ప్రమీల, బింగి లక్ష్మి, సౌందర్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, కోశాధికారి బొలిశెట్టి శ్రీనివాస్, నాయకులు సౌళ్ల సంఇదీప్, బొద్దున మల్లేశ్, ప్రకాశ్‌శర్మ పాల్గొన్నారు.
గ్యాస్ ధర పెంపుపై మండిపాటు
Published Fri, Jan 3 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement