మంచిర్యాల కోర్టు వద్ద ఉద్రిక్తత | lawyers protest for T high court | Sakshi
Sakshi News home page

మంచిర్యాల కోర్టు వద్ద ఉద్రిక్తత

Published Tue, Feb 24 2015 12:53 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

మంచిర్యాల కోర్టు వద్ద ఉద్రిక్తత - Sakshi

మంచిర్యాల కోర్టు వద్ద ఉద్రిక్తత

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలు మంగళవారం ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహార దీక్షలు చేపట్టారు.  ఆంధ్ర రాష్ట్రానికి చెందిన న్యాయ అధికారులను తమ రాష్ట్రానికి పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం నుంచి రిలే దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే పోలీసు బందోబస్తు మధ్య న్యాయమూర్తి కేసుల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారంటూ న్యాయవాదులు కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని ఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగాయి. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ ఆందోళనను మరింత ఉధృత చేయనున్నట్లు ప్రకటించారు.
(మంచిర్యాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement