
ఆంధ్రప్రదేశ్:
► నేడు కూడా నిత్యావసరాల సరఫరా కొనసాగుతుందని ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలిపారు.
► సోమ, మంగళవారాల్లో జరిగినట్టుగానే నిత్యావసరాల సరఫరా
► జనసంద్రతను తగ్గించేందుకు పలు చోట్ల రైతు బజార్‌లు ఏర్పాటు
► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రైతు బజార్ ఏర్పాటు
► ఉ.6 గంటల నుంచి 9 గంటల వరకు వినియోగదారులకు అనుమతి
► నేటి నుంచి హైకోర్టుకు సెలవులు, కరోనా నివారణపై ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు సెలవులుఈనెల 27, 31 తేదీల్లో అత్యవసర పిటిషన్లను విచారించనున్న హైకోర్టు
తెలంగాణ:
► తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు
► కరోనా విస్తరించిన జిల్లాలను జోన్లుగా విభజన
► గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో ప్రత్యేక చర్యలు
► ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండటంతో 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
జాతీయం:
► నిన్న అర్ధరాత్రి( మంగళవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్.
► రాబోయే 21 రోజులు దేశమంతా లాక్‌డౌన్
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 18,810కి చేరిన కరోనా మృతుల సంఖ్య, 4.21 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య, కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,08,388 మంది
► ఇటలీలో 7వేలు, స్పెయిన్‌లో 3వేలకు చేరిన మృతులు
► అమెరికాలో 700కు చేరిన కరోనా మృతుల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment