
ఆంధ్రప్రదేశ్:
► నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
► లాక్ డౌన్ అమలు, నిత్యావసర సరుకుల అందుబాటు, రేషన్ సరఫరా వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం
► కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు.
► అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగనుంది.
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
► ఇప్పటివరకు ఏపీలో ఇద్దరు కరోనా పాజిటివ్ కేసులు నెగిటివ్‌గా తేలింది.
► విశాఖలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా నెగిటివ్ వచ్చింది.
► ఇప్పటివరకు 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
► 495 మందికి నెగిటివ్, పెండింగ్‌లో మరో 100 కేసుల ఫలితాలు రావాల్సి ఉంది.
► నేడు రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ
► సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్ తీసుకుంటున్న ప్రజలు
► 3 విడతల్లో ఒక యూనిట్‌కు 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ
► ఉదయం 6 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ
తెలంగాణ:
► నేడు రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
► ఉదయం 11.30 గంటలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కి చెందిన ఆరుగురు ప్రతినిధులతో కనీస మద్దతు ధరపై సీఎం చర్చించనున్నారు.
జాతీయం:
► భారత్‌లో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
► దేశంలో ఇప్పటివరకు 1024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 27 మంది మృతి చెందారు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 34 వేలకు చేరింది.
► ప్రపంచ వ్యాప్తంగా 7.21 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు
► ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,51,004 మందికి చేరింది.
► కరోనా బాధితుల సంఖ్య అమెరికాలో 1,41,812కు చేరింది.
► ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
► ఆదివారం కరోనాతో ఇటలీలో 756, స్పెయిన్‌లో 821 మంది మృతి చెందారు.
► చైనాలో 3300, ఇరాన్‌లో 2,640, ఫ్రాన్స్‌లో 2606.. అమెరికాలో 2,475, ఇంగ్లండ్‌లో 1,228 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment