
ఆంధ్రప్రదేశ్:
► నేడు పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
► ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్న ప్రభుత్వం
► పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం
► కోటి 28లక్షల 51వేల 482 కుటుంబాలకు ఆర్థిక సహాయం
► పేదలకు ఆర్థిక సహాయం చేసేందుకు రూ.1300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది.
► పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు.
► కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది.
తెలంగాణ:
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 299 నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.
జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరింది.
► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో 192 మంది బాధితులు కోలుకున్నారు.
► మహారాష్ట్రలో 490 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు.
► తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 411 నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
► ఢిల్లీలో 386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.
ప్రపంచం:
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 59 వేలు దాటింది.
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11లక్షల చేరింది.
► ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 28వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,965కి చేరింది.
► అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 7,391కు చేరింది.