ప్రకాశం : ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చింతల వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దాంతో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం నుంచి విజయవాడకు వెళుతున్న విజయవాడ డిపో డీలక్స్ బస్సును ఘాట్ రోడ్డులో కర్నూలు జిల్లా బనగానపల్లె డిపోకు చెందిన బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో విజయవాడ డిపో బస్సు లోయలో పడిపోయింది. అయితే, కొద్ది లోతులోనే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ తిరుమలయ్యకు తీవ్ర గాయాలు కాగా, మరో 14 మంది ప్రయాణికులు స్వలంగా గాయపడ్డారు. లోయలో పడిన బస్సులో 40మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ తహసీల్దార్ బెంజమిన్‌తో పాటు, వినుకొండకు చెందిన ఎన్‌వీఎస్ శర్మ, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంకు చెందిన బ్రహ్మం, విష్ణు, విజయవాడకు చెందిన తాత మనవళ్లు జమలయ్య, అవినాష్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. క్షతగాత్రులను 108, ఆర్టీసీ బస్సుల్లో దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లోయలో పడిన బస్సు; 14 మందికి గాయాలు
Published Fri, Mar 6 2015 7:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement