నందివాడ: స్కూల్ కి వెళ్తున్న బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలికకు స్వల్ప గాయమైంది. కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లిలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నున్నా లక్ష్మణరావు కుమార్తె లిఖిత(12) స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది.
సోమవారం ఉదయం ఆమె స్కూలు కు వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేస్తూ పక్కకు తప్పుకోవటంతో ప్రమాదం నుంచి బయటపడింది. బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ఏలూరు వైపు వెళ్లినట్టు స్థానికులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.