గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తి గొంతు కోసి, రాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు.
కలసపాడు (వైఎస్సార్ జిల్లా) : గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తి గొంతు కోసి, రాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం ఎగువతంబళ్లపల్లి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని రామాపురంకు చెందిన బసిరెడ్డి వీరారెడ్డి(50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
అయితే పక్క గ్రామమైన ఎగువతంబళ్లపల్లిలో మాంసం అంగడి వద్ద శవమై కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ హత్యకు గత కారణాలు, కారకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.