
గోపాలుడు మంచి బాలుడు అనేలా నమ్మించాడు. బుద్ధిగా పనిచేసుకుంటూనే తన వక్రబుద్ధిని తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఆలయ అభివృద్ధి కోసం వేస్తున్న చీటీల నిర్వహణ బాధ్యతలు చూస్తూ జెంటిల్‌మెన్‌గా మెలిగాడు. చీటీలు ఎత్తిన వారికి డబ్బు ఆగమాగం చేసుకోవద్దని, తాను నెలనెలా వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికి చివరికి నట్టేట ముంచాడు.
కర్నూలు, కోడుమూరు: పట్టణంలోని శ్రీరాముల వారి ఆలయం నిర్వహణ కోసం భక్తమండలి సభ్యులు చీటీలు వేసేవారు. రూ.15వేల జీతం ఇస్తూ చీటీల నిర్వహణకు ఓ వ్యక్తిని నియమించుకున్నారు. అతడు మొదట్లో నమ్మకంగా పనిచేసినా దాదాపు రూ.40లక్షల టర్నోవర్ కలిగిన రాములవారి ఆలయం ఆర్థిక నిధిపై కన్నుపడింది. అందులోభాగంగా ఏడాది నుంచి చీటీల పేరుతో వసూలు చేసిన డబ్బులను స్వాహా చేసేందుకు పక్కా వ్యూహం రచించుకున్నాడు. ఆలయం తరఫున వేసిన చీటీలు ఎత్తుకున్న సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని ప్రామిసరి నోట్ రాసిచ్చేవాడు. అనుమానం రాకుండా నెలనెలా మాత్రం వడ్డీలు కడుతూ వచ్చాడు. ఇలా 15 చీటీలకు సంబంధించి రూ.40 లక్షలతో పాటు అయ్యప్పస్వామి ఆలయానికి సంబంధించిన రూ.7లక్షలు, స్నేహ వినాయక కళ్యాణ మండపానికి సంబంధించిన రూ.9లక్షలు ఇలా పట్టణ ంలోని పలువురి నుంచి వడ్డీలకు తీసుకు న్న మొ త్తంతో కలిపి రూ.2కోట్ల వరకు సదరు వ్యక్తి తన వద్దే ఉంచుకుని ప్రామిసరి నోట్లు రాసిచ్చాడు.
ఇల్లు తనఖా పెట్టి..
డబ్బు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు కూడా ఆ వ్యక్తి తీసుకున్నట్లు సమాచారం. అందులోభాగంగానే.. తన బాగోతం బయటపడితే తన ఆస్తులపై పడతారని భావించి ఇటీవలే ఇల్లును కూడా వేరేవ్యక్తి వద్ద తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు సమాచారం.
బయటపడింది ఇలా..
వారం క్రితం రాములవారి ఆలయానికి సంబంధిం చిన చీటీ ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా సతాయిన్నాడు. చీటీ ఎత్తుకున్న వ్యక్తి విసుగుచెంది ఆలయ భక్త బృందం మండలికి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు మోసగాడి చీటీల గోల్‌మాల్ వ్యవహారం గుట్టురట్టయింది. వారం రోజుల పాటు ఆ లయ భక్త బృందం సభ్యులు వ్యక్తి వ్యవహారంపై విచారిస్తుండటంతో ఒక్కొక్కటీì వెలుగులోకి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment