బొబ్బిలి (విజయనగరం): ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న యువకుడు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగొడ్డువలసలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. బల్జిపాడు మండలం బర్లి గ్రామానికి చెందిన బి. కృష్ణారావు (18) ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం నాడు దిబ్బగొడ్డువలస లెవల్ కేవీ వద్ద మెంయిటెనెన్స్ పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.