మొగల్తూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుతాళ్లు గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగ రవీంద్రబాబు(22) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై నర్సాపురం వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.