విశాఖ జిల్లా ఆనందవరం మండలం వెల్లంకి గ్రామ శివారులో శనివారం ఉదయం ఓ యువకుని మృతదేహం బయటపడింది.
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందవరం మండలం వెల్లంకి గ్రామ శివారులో శనివారం ఉదయం ఓ యువకుని మృతదేహం బయటపడింది. మృతుని గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన రాంసింగ్(27) వెల్లంకిలో మిఠాయి దుకాణం నడిపేవాడు. శుక్రవారం సాయంత్రం రూ.4 లక్షల నగదు, పది తులాల బంగారం తీసుకెళ్లిన రాంసింగ్ ఇంటికి రాలేదని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు, నగలు దోచుకుని రాంసింగ్ ను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.