ramsingh
-
రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని ఒప్పుకో
సాక్షి, అమరావతి: తాను చెప్పినట్టుగా వినలేదని గతంలో పులివెందుల డీఎస్పీ ఆర్.వాసుదేవన్‌పై సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అవమానించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన డీఎస్పీ వాసుదేవన్ ఈ విషయంపై కడప ఎస్పీకి గతేడాదే ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలను నిగ్గుతేల్చడం మీద కాకుండా.. తాను ముందుగా అనుకున్నదే చెప్పించేందుకే యత్నిస్తున్నారన్నది ఈ ఘటనను బట్టి స్పష్టమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ఏకంగా పోలీసు అధికారులనే బెదిరిస్తుండటం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్పీ వాసుదేవన్ కడప ఎస్పీకి 2021, అక్టోబర్ 10న ఇచ్చిన ఫిర్యాదులోని ప్రధాన అంశాలు ఇవీ... ఎవరు ఒత్తిడి చేశారో చెప్పు.. 2021, సెప్టెంబర్ 1న డీఎస్పీ వాసుదేవన్‌ను సీబీఐ అధికారులు కడపలోని గెస్ట్ హౌస్‌కు పిలిపించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించిన విషయం తెలుసా అని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ అడిగారు. తనకు తెలియదని డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు. శంకర్‌రెడ్డి తనను బెదిరించినట్టుగా సీఐ శంకరయ్య స్టేట్మెంట్ ఇచ్చారు కదా అని రామ్‌సింగ్ గదమాయించారు. ఆయన అటువంటి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదని డీఎస్పీ వాసుదేవన్ కచ్చితంగా చెప్పారు. దాంతో సీఐ శంకరయ్య స్టేట్మెంట్ను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ మరోసారి సరిచూశారు. అందులో అలాంటి విషయం ఏమీ లేకపోవడంతో ఆయన డీఎస్పీ వాసుదేవన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘మీరంతా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు. సరిగ్గా కేసులు విచారించరు. మీరంతా పిరికివాళ్లు’ అని విరుచుకుపడ్డారు. దీనిపై వాసుదేవన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తామంతా సమర్థులం కాబట్టే సిట్‌లో తమను నియమించారని, 30 ఏళ్ల తన సర్వీసులో ఎన్నో సంచలన కేసులను విజయవంతంగా ఛేదించినందునే ఆ అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. తాను పులివెందులలో పోస్టింగ్ కావాలని ఏ రాజకీయ నేత వద్దకూ వెళ్లలేదని చెప్పారు. తన సమర్థతను గుర్తించే పోస్టింగ్ ఇచ్చారన్నారు. దాంతో సీబీఐ అధికారి రామ్‌సింగ్ ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘రాజకీయ నేతల నుంచి ఒత్తిడి వచ్చినందునే ఉదయ్‌కుమార్‌రెడ్డిని విచారించకుండా పంపించావు. అలా ఫోన్ చేసి ఒత్తిడి చేసిన రాజకీయ నేతలు ఎవరో చెప్పు’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తమపై రాజకీయ నేతలెవరూ ఒత్తిడి చేయలేదని, ఎవరూ ఫోన్లు చేయలేదని డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు. తాము సక్రమంగా దర్యాప్తు చేశామన్నారు. కాగా, సీబీఐ అదనపు ఎస్పీ తనను అవమానించడంతో డీఎస్పీ వాసుదేవన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. 30 ఏళ్లుగా పోలీసు సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తున్న తనను అవమానించడంపై ఆయన కడప ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
మేం చెప్పినట్లే వాంగ్మూలం ఇవ్వాలి.. లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించడం మీద కంటే మీడియాలో తప్పుడు ప్రచారానికే సీబీఐ ప్రాధాన్యమిస్తోంది. తాము చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పోలీసు అధికారినే బెదిరించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ‘నిన్ను ఉరి తీయాలి.. నీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అంటూ గతంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ బెదిరించడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సీఐ నిరాకరించడంతోనే రామ్‌సింగ్ ఆ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. సీఐ శంకరయ్య చెప్పకున్నా సరే.. ఆయన చెప్పినట్టుగా తమకు నచ్చిన విషయాలను స్టేట్మెంట్గా రాసేసుకున్నారు. అదే విషయాన్ని న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. ఇదంతా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగింది. రామ్‌సింగ్ వేధింపులతో విసిగిపోయిన సీఐ శంకరయ్య ఆయనపై కడప జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము సీఐని బెదిరించిన విషయాన్ని, ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని దాచివేసి.. సీఐ పేరిట తాము రాసుకున్న స్టేట్మెంట్ను సీబీఐ మంగళవారం మీడియాకు లీకు ఇచ్చి హడావుడి చేసింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని.. ఇప్పుడే జరిగినట్టుగా టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది. తప్పుడు స్టేట్‌మెంట్‌కోసం సీఐపై ఒత్తిడి.. ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న రామ్‌సింగ్ తీరు.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐకి మచ్చతీసుకువస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ సింగ్‌పై 2021, అక్టోబర్ 7న కడప ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నఅంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఫిర్యాదులో ఏముందంటే.. సీబీఐ అధికారులు సీఐ శంకరయ్య నుంచి 2020, జూన్ 27, 28 తేదీల్లోనే పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా 2021, ఆగస్టు 10న సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు పిలిపించారు. అక్కడ శంకరయ్యను చూస్తూనే ‘నిన్ను ఉరి తీయాలి’ అని తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. తానేం చేశానని శంకరయ్య అనగా.. తాము చెప్పినట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. ఆ వాంగ్మూలం ఎలాగంటే.. వివేకా హత్య జరిగిన రోజున సీఐ శంకరయ్య వెళ్లేసరికి ఆయన మృతదేహం బాత్రూమ్లో ఉందని, ఆయన సమక్షంలోనే రక్తపు మరకలు తుడిచివేశారని, మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి తీసుకువచ్చారని చెప్పమని రామ్‌సింగ్ సీఐ శంకరయ్యకు చెప్పారు. అందుకు సీఐ శంకరయ్య సమ్మతించక జరిగింది వివరించారు. తాను వెళ్లేసరికే వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి తీసుకువచ్చేశారని, అక్కడ రక్తపు మరకలు తుడిచివేశారని శంకరయ్య చెప్పారు. కానీ రామ్‌సింగ్ అవేవీ వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వాలని గట్టిగా అరుస్తూ బెదిరించారు. అంతేకాదు.. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ను ఉద్దేశించి ‘లాఠీ తీసుకురా.. వీడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అన్నారు. సీఐ శంకరయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాసి ఆ విధంగా చెప్పాలని ఒత్తిడి చేశారు. శంకర్‌రెడ్డి బెదిరించారని చెప్పు... ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనను పక్కకు తీసుకువెళ్లి బెదిరించినట్టుగా కూడా చెప్పాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తనపై ఒత్తిడి చేశారని సీఐ శంకరయ్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నేను పోలీస్ అధికారిని. ఆ సమయంలో నా వద్ద 9ఎంఎం పిస్టల్ కూడా ఉంది.. నన్ను ఎవరూ బెదిరించ లేదు. బెదిరించలేరు కూడా’ అని సీఐ స్పష్టం చేశారు. దాంతో సీఐ స్టేట్మెంట్ను అంతకుముందే 2020, జూన్ 27న సీబీఐ తీసుకుందని చెబుతూ ఇక అవసరం లేదని సీఐ శంకరయ్యను రామ్‌సింగ్ పంపించివేశారు. మీడియాకు లీకులతో రాజకీయ డ్రామా వాస్తవాలు కాకుండా తాము రాసుకున్న స్క్రిప్ట్‌ను చెప్పించాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను తీవ్రంగా బెదిరించారు. కానీ అందుకు ఆయన సమ్మతించకపోయేసరికి మిన్నకుండిపోయారు. ఈ విధంగా పలువురిని రామ్‌సింగ్ బెదిరిస్తున్న విషయం వివాదాస్పదమైంది. ఆయన బెదిరింపులకు భయపడిన ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే ఉద్యోగి పోలీసులకు, న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దాంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీబీఐ కొత్త ఎత్తుగడ వేసింది. గతంలో సీఐ శంకరయ్య పేరుతో తాము రాసుకున్న వాంగ్మూలం అంటూ మీడియాకు మంగళవారం లీకులు ఇచ్చింది. అందులో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది. అయితే సీబీఐ ముందుగా రాసుకున్న అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించ లేదు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను ఉరి తీస్తామన్నా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామన్నా, తిరిగి కేసు పెడతామన్నా సరే ఆయన బెదరిపోలేదు. పైగా తనను రామ్‌సింగ్ వేధిస్తున్న తీరుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జరిగింది ఇదైతే.. సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి తెగబడటంపట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా కేసు దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అధికారి రామ్‌సింగ్, రాజకీయ పార్టీల మాదిరిగా మీడియాకు లీకుల పేరుతో తప్పుడు సమాచారమిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వాలి.. రామ్‌సింగ్ 2021, సెప్టెంబర్ 28న తనకు వాట్సాప్ కాల్చేసి కడపలోని గెస్ట్‌హౌస్‌కు పిలిపించి కోర్టులో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వాలని చెప్పారని సీఐ శంకరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలిసిన విషయాలు చెప్పేందుకు సమ్మతమేనని సీఐ ఆయనతో చెప్పారు. కానీ రామ్‌సింగ్ అప్పటికే తయారు చేసిన వాంగ్మూలాన్ని ఇచ్చి చదువుకోవాలని సీఐకు చెప్పారు. అందులో ఉన్నట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే ఐపీసీ 201 కింద కేసు పెడతానని కూడా సీఐ శంకరయ్యను హెచ్చరించారు. దాంతో ఆయన ముందుగానే రాసినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించలేదు. అందుకే తాను సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పేశారు. -
సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు
సాక్షి, అమరావతి: మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై కడప పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామ్‌సింగ్ తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 18న ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. విచారణ పేరుతో రామ్‌సింగ్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఈ నెల 15న కడప జిల్లా ఏఆర్ ఎస్పీ మహేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయమై కడప జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు పిటిషన్ ద్వారా విన్నవించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విచారణ పేరుతో తనను రామ్‌సింగ్ 22సార్లు పిలిచి బెదిరించారని ఉదయ్‌భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఏడాదిగా బెదిరింపులకు గురి చేస్తూ వేధించారని చెప్పారు. లేకపోతే అక్రమ కేసులు పెడతానని కూడా రామ్‌సింగ్ హెచ్చరించినట్టు తెలిపారు. తమ ఇంటికి పోలీసులతో వచ్చి మరీ దౌర్జన్యం చేశారని, అడ్డుకోబోయిన తన తల్లిని నెట్టివేశారని ఉదయ్‌భాస్కర్ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వేధింపుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాంప్రసాద్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన మేజిస్ట్రేట్ ఎం.ప్రదీప్‌కుమార్ సీఐబీ అధికారులపై చట్టపరమైన చర్యల కోసం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో వెంటనే కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 25లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 195ఏ, 323, 506ఆర్/డబ్ల్య్లూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహాలో పలువురు ఫిర్యాదులు చేయడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని అనంతపురం జిల్లాకు చెందిన గంగాంధరరెడ్డిని ఆయన వేధించినట్టు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా, వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో డీఎస్పీ, సీఐలను కూడా రామ్‌సింగ్ తీవ్రంగా వేధించారనే విషయం వెలుగుచూసింది. తమతో అవమానకరంగా మాట్లాడారని, తీవ్రంగా బెదిరించారని డీఎస్పీ వాసుదేవన్, సీఐ శంకరయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను ఎస్పీ రాష్ట్ర డీజీపీకి నివేదించారు. ఈ కేసులో రామ్‌సింగ్ ఉద్దేశపూర్వకంగా పలువురిని వేధిస్తున్నట్టు.. తాను చెప్పినట్లే చేయాలని బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. రామ్‌సింగ్ వివాదాస్పద, ఏకపక్ష వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. -
వెల్లంకిలో యువకుడి హత్య
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందవరం మండలం వెల్లంకి గ్రామ శివారులో శనివారం ఉదయం ఓ యువకుని మృతదేహం బయటపడింది. మృతుని గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన రాంసింగ్(27) వెల్లంకిలో మిఠాయి దుకాణం నడిపేవాడు. శుక్రవారం సాయంత్రం రూ.4 లక్షల నగదు, పది తులాల బంగారం తీసుకెళ్లిన రాంసింగ్ ఇంటికి రాలేదని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు, నగలు దోచుకుని రాంసింగ్ ను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దెయ్యమై భయపెడుతున్న 'నిర్భయ' దోషి
నిర్భయ కేసు దోషుల్లో ఒకడిగా శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డ రాంసింగ్ దెయ్యంగా మారాడు! గతంలో అతడు నివసించిన ఇంట్లో ఆత్మ రూపంలో నివసిస్తూ చుట్టూపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. తన జోలికి వస్తే చిన్నాపెద్దా, ముసలి ముతకా ఎవ్వర్నీ వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నాడు. కట్టుకథను తలపించేలా ఉన్నా ప్రస్తుతం ఢిల్లీలోని సంత్ రవిదాస్ క్యాంప్‌లోని మురికివాడలో ఎవరినోట విన్నా ఇదే చర్చ! 2012, డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై కిరాతకంగా లైంగికదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితుల్లో ఒకడైన రాంసింగ్.. కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం నలుగురు దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. రాంసింగ్, అతని సోదరుడు ముఖేశ్ లు నేరానికి పాల్పడినప్పటినుంచి అల్లకల్లోలంగా మారిన వారి కుటుంబం.. రాంసింగ్ ఆత్మహత్య తరువాత సొంత ప్రాంతం రాజస్థాన్ కు తరలివెళ్లింది. ఢిల్లీలో వారు నివసించిన ఇల్లు గత రెండేళ్లుగా తాళం వేసి ఖాళీగా ఉంటోంది. ఆ ఇంట్లోనే రాంసింగ్ ఆత్మతిరుగుతోందని, చుట్టుపక్కల వాళ్లు నమ్ముతున్నారు. గల్లీల్లో ఆడుకునే పిల్లలెవ్వర్నీ ఆ ఇంటివైపు వెళ్లొద్దని తల్లులందరూ చెప్తున్నారు. 'రాంసింగ్ దెయ్యంగా మారాడని అందరూ అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా నేను నమ్మినా, నమ్మకున్నా పిల్లల్ని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి ఆ ఇంటివైపు వెళ్లొద్దని చెప్తున్నాను' అని స్థానిక మహిళ ఒకరు తన అభిప్రాయాన్ని తెలిపారు. బతికున్నప్పుడు కీచకపర్వానికి ఒడిగట్టిన రాంసింగ్.. చనిపోయాక కూడా దెయ్యమై జనానికి కునుకులేకుండా చేస్తున్నాడని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గణాంకాలతో హాజరు కావాలి
ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర వెల్లడి అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ సరఫరా, వినియోగం, డిమాండ్, వసూళ్లు తదితర అంశాలపై పూర్తి అవగాహన, సరైన గణాంకాలతో సమావేశానికి హాజరుకావాలని, లేదంటే రావద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) హెచ్‌వై దొర జిల్లా అధికారులకు చురకంటించారు. స్థానిక విద్యుత్‌శాఖ ఎస్ఈ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆ యన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన అడిగిన పలు సందేహాలు, ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై అవగాహన లేకుండా సమావేశాలకు హాజరుకావద్దని మండిపడ్డారు. అనంతపురం, క ర్నూలు జోన్ చీఫ్ ఇంజనీరు పీరయ్య, డెరైక్టర్ రామ్‌సింగ్, జిల్లా ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాద్‌రెడ్డితో కలిసి వివిధ అంశాలపై సీఎండీ సమీక్షించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు, దొంగ కరెంటు వినియోగంపై కేసులు నమోదు చేయకపోవడం, ఆధార్ సేకరణలో నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఏడు జిల్లాల కన్నా అనంతపురం జిల్లా వెనుకబడి ఉందన్నారు. వచ్చే నెల నుంచి 100 శాతం వసూళ్లు చేయాలన్నారు. అపరాధ రుసుం రూ.2 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నా వసూళ్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ నెల 10లోగా వంద శాతం ఆధార్ సేకరణ కాకపోతే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. సమావేశంలో అనంతపురం, గుత్తి, కదిరి, హిందూపురం, కళ్యాణదుర్గం డివిజన్ల డీఈలు కె.సంపత్‌కుమార్, పీవీ రమేష్, శేషగిరిరావు, నాగేంద్రకుమార్, శ్రీనివాసులు, ఎస్‌ఏవో విజయభాస్కర్‌తో పాటు ఎస్ఈ కార్యాలయ డీఈలు, ఏడీఈలు, ఏఈలు హాజరయ్యారు. విద్యుత్‌శాఖకు సంబంధించి వివిధ ఉద్యోగుల యూనియన్లు పలు డిమాండ్ల సాధనకు సీఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎండీ దొరకు రైతు సంఘం వినతి పత్రం : విద్యుత్ ప్రమాదాల్లో మరణిస్తున్న బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంకే వెంకటరెడ్డి, కార్యదర్శి పి.పెద్దిరెడ్డి సీఎండీ హెచ్‌వై దొరకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఆపరేటర్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయండి : జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్, వాచ్మెన్ పోస్టులు అర్హులైన మీటర్రీడర్స్తో భర్తీ చేయాలని సీఐటీయూ అనుబంధ యునెటైడ్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యుఈఈయు) నేతలు సీఎండీ హెచ్‌వై దొరకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ అధ్యక్షుడు ఎం.రామచంద్ర, కార్యదర్శి టి.మారుతీకుమార్, నాయకులు మహబూబ్‌బాషా, సుబ్రమణ్యం ఉన్నారు. -
రికార్డ్ : మీసాల రాయుడి సలహాలు!
రామ్‌సింగ్ చౌహాన్.. తన మీసం పొడవుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తి. 4.29 మీటర్లు లేదా 14 అడుగుల పొడవున్న మీసంతో చౌహాన్ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. దాంతో మీడియా చౌహాన్ వెంట వెంటే తిరుగుతోంది. మీసాలు అంత పొడవుగా పెంచడం ఎలా? అని అడుగుతోంది. టెక్నిక్స్ చెప్పమని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతానికి మీసం పొడవు విషయంలో చౌహాన్‌ను బీట్ చేసే వారు కూడా ఎవరూ దరిదాపుల్లో లేకపోవడంతో చౌహాన్ కూడా ‘మీసం పెంచడం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశం గురించి విపులంగా చెబుతున్నాడు. ముందుగా పొడవాటి మీసం పెంచాలని అనుకునే వారు టీనేజీ నుంచే మీసం మీద ప్రత్యేక దృష్టిపెట్టి ఉండాలట. యవ్వనంలో ఉన్నప్పుడు హార్మోన్లకు మంచి శక్తి ఉంటుందని, మీసం సులభంగా పెరిగే అవకాశాలుంటాయని చౌహాన్ అంటున్నాడు. ఇక తరచూ మీసాలకు మసాజ్ అవసరమని.. ఈ విషయంపై చాలా శ్రద్ధ వహించాలని సూచించాడు. అన్నింటికీ మించి మీసం ఇంట్లో వాళ్లకు అడ్డం కాకూడదని.. ప్రత్యేకించి పెళ్లైన వారు తమ భార్య పర్మిషన్ తీసుకొని, ఆమె ఇష్టపడితేనే మీసం పెంచితే పద్ధతిగా ఉంటుందని ఈ మీసాల రాయుడు సూచిస్తున్నాడు. చౌహాన్ సూచనలను ప్రఖ్యాత వార్త సంస్థ బీబీసీ కూడా తన వెబ్సైట్లో ఉంచడం విశేషం !