విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం పెదచెలగాం గ్రామంలోని ఓ తోటలో సోమవారం ఒలిసి నర్సింహులు(48) అనే గిరిజనుడు అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
విజయనగరం (రామభద్రాపురం) : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం పెదచెలగాం గ్రామంలోని ఓ తోటలో సోమవారం ఒలిసి నర్సింహులు(48) అనే గిరిజనుడు అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఎవరో కావాలని చంపి ఇక్కడ పడేసి ఉంటారని ఆయన సోదరుడు సీతారాం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.