నర్సీపట్నంరూరల్, న్యూస్‌లైన్: విశాఖ మన్యం లో మునుపటి ఆధిపత్యాన్ని మళ్లీ దక్కించుకోవాలని ఆరాటపడుతున్న మావోయిస్టులు ఆ దశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజనులకు మరింతగా సన్నిహితం కావడానికి వ్యూ హం రూపొందిస్తున్నారు. ఏవోబీలో ఒడిశా ప్రాంతం కన్నా విశాఖ ఏజెన్సీ మావోయిస్టులకు సురక్షితమైనదిగా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ యువత రిక్రూట్‌మెంట్ కూడా అధికంగా ఉండేది.
గిరిజన గ్రామాల్లో ఖాళీగా ఉండే యువకులను ఆకట్టుకుని వారికి శిక్షణ ఇచ్చి ముందు మిలీషియా సభ్యులుగా, తర్వాత పూర్తి స్థాయి దళ సభ్యులుగా చేర్చుకు నే వారు. ఆవిధంగా తమ కార్యకలాపాలు సులువుగా సాగించుకునేవారు. అయితే ఇటీవ ల కాలంలో గిరిజన యువతకు దగ్గరయ్యేం దుకు పోలీసులు చేపడుతున్న కార్యకలాపాల తో మావోయిస్టులకు చుక్కెదురవుతోంది. దాంతో గ్రామాల్లో సామాజిక కార్యకలాపాల పై వారు దృష్టి పెడుతున్నారు.
అపరాల సీజన్‌పై దృష్టి
ఏజన్సీలో కీలకమైన అపరాల సీజన్‌ను అవకాశంగా చేసుకొని మావోయిస్టులు తమ ప్రాబ ల్యం పెంచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నా రు. గిరిజనులు ఏడాది పొడవునా జీవనానికి అవసరమయ్యే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపరాల వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అపరాల వ్యాపారం ఊపందుకోవడంతో గిరిరైతులకు మేలు చేయడం ద్వారా తమ పట్టు నిలబెట్టుకోవాలని మావోయిస్టులు యత్నిస్తున్నారు.
అపరాలకు గిట్టుబాటు ధర ఇప్పించి, ఏళ్ల తరబడి నిలిచిపోయి న బకాయిలు వసూలుకు కృషి చేసి గిరిజనుల ఆదరణ పొందాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు సేకరిస్తూ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.
వ్యాపారులపై ఒత్తిడి
గిరిజనులకు బకాయిలు చెల్లించేలా మావోయిస్టులు అప్పుడే ఒత్తిళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల ఆరున గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఓ వ్యాపారి భార్యను, మంగళవారం మరో అపరాల వ్యాపారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. దారకొండకు చెందిన వ్యాపారి చేత రైతులకు బకాయి చెల్లింపజేసి అతని భార్యను చెర నుంచి విడిచి పెట్టినట్టు తెలిసిం ది.
అలాగే గిరిజనులకు బకాయి పడ్డ మొత్తా న్ని చెల్లిస్తేనే వ్యాపారిని విడిచిపెడతామని చెప్పిన మావోయిస్టులు ప్రజాకోర్టులో విచారిం చి అతనిని విడిచిపెట్టినట్లు తెలిసింది. గతంలో గిరిజనుల మద్దతు కూడగట్టుకోవడానికి మా వోలు ఇదేఎత్తుగడ అనుసరించారు. ఇప్పుడూ అదే బాటలో యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ పట్టుకు మావోయిస్టుల ఎత్తు
Published Thu, Jan 16 2014 6:37 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement