తీవ్రంగా కొట్టి, బ్లేడ్‌తో
పీక కోసిన వైనం
జంగారెడ్డిగూడెంలో ఘటన
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత హత్యకు గురైంది. దుండగులు ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చారు. వివరాలు ఇలా ఉన్నారుు. స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న రొంగల అప్పారావు, సుబ్బలక్ష్మి దంపతుల రెండో కుమార్తె రొంగల దివ్య (18)ను 2013లో టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన నీరుకొండ రాజేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం క్రితం రాజేష్, దివ్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమె పుట్టింట్లో ఉంటోంది. రెండు నెలల క్రితం రాజేష్, దివ్యలు విడాకులు తీసుకున్నారు. దివ్య తల్లిదండ్రుల వద్ద ఉంటూ జంగారెడ్డిగూడెంలోని ఒక దుకాణంలో పనిచేస్తోంది. దివ్య తల్లిదండ్రులు కాఫీ హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు.
శనివారం రాత్రి షాపు నుంచి ఇంటికి వచ్చిన దివ్య భోజనం చేసి నిద్రించిందని, అయితే రాత్రి 1.30 గంటలకు లేచిచూడగా తన కూతురు కనిపించ లేదని ఆమె తల్లి సుబ్బలక్ష్మి తెలిపింది. దివ్య కోసం గాలిస్తుండగా ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని రైస్‌మిల్లు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో శవమై కనిపించిందని తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఎ.ఆనందరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని దివ్య మృతదేహాన్ని పరిశీలించారు. ముఖంపై గట్టిగా కొట్టినట్టు గాయూలను, పీకపై బ్లేడ్‌తో కోయడాన్ని గుర్తించారు. పథకం ప్రకారమే దివ్యను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దివ్యను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు అప్పారావు, సుబ్బలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వివాహిత హత్య
Published Mon, Jul 13 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement