డ్వాక్రా సంఘాలకు మస్కా! | Maska to dwakra groups! | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సంఘాలకు మస్కా!

Published Mon, Sep 15 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

డ్వాక్రా సంఘాలకు మస్కా!

డ్వాక్రా సంఘాలకు మస్కా!

నాసిరకం ఇసుక ఉండే వాగులు మహిళా సంఘాలకు  అనుమతుల్లేవంటూ నదీ పరివాహక రీచ్‌లను ఇవ్వని ప్రభుత్వం
 
హైదరాబాద్:  ఇసుక రీచ్‌లను మహిళలకు అప్పగించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేస్తామన్న ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోంది. నాణ్యమైన నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను, అనుమతులు లేవన్న కారణంతో డ్వాక్రా సంఘాలకు అప్పగించని సర్కారు.. నాణ్యత లేని పెద్ద వాగులను అప్పగించి చేతులు దులుపుకొంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత నెల 28 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు ఉన్న ఇసుక లీజులన్నీ రద్దరుునట్లేనని పేర్కొంటూ అదే రోజు ఆదేశాలు (జీవోఎంఎస్ నంబర్ 94) జారీ చేసింది. అరుుతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 84 ఇసుక రీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల్లేనందున, వీటిలో తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్ధం. ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించాలని రెండున్నర నెలల క్రితమే నిర్ణరుుంచినప్పటికీ, ఒక్కదానికి కూడా పర్యావరణ అనుమతి సాధించలేదు. ఈ అనుమతులకు ఉద్దేశించిన రాష్ట్రస్థాయి కమిటీ గడువు గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటుకు పూనుకోలేదు.

‘ప్రైవేటు’గా తరలిపోతున్న ఇసుక..

పాత లీజులను రద్దు చేసినా.. కొన్ని ప్రాంతాల్లో ఆ పేరిట ప్రైవేటు వ్యక్తులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 10 లీజుల వరకు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానికుల కథనం. జీవో జారీ చేసినప్పటికీ. లీజులు రద్దైనట్టు తమకు ఉత్తర్వులు అందని కారణంగానే పాత లీజులు యథావిధిగా కొనసాగిస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలంలో రోజుకు కనీసం 150 లారీలు, తాడేపల్లి మండలంలో రోజుకు 60 లారీల ఇసుక తరలిపోతున్నటు సమాచారం. కర్నూలు జిల్లా తుంగభద్ర నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుక తరలుతున్నట్లు సమాచారం. పర్యావరణ అనుమతులు లేవనే కారణంతో ఈ ఇసుక రీచ్‌లను తమకు అప్పగించని ప్రభుత్వం.. ప్రైవేటు వ్యక్తులు తవ్వకాలు కొనసాగిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డ్వాక్రా సంఘాలు ప్రశ్నిస్తున్నారుు.

డ్వాక్రాల ఆధ్వర్యంలో ఒక్కచోటే తవ్వకాలు..

నదీ పరివాహక ప్రాంతాల్లోని 84 రీచ్‌లలో 9చోట్ల అంతర్రాష్ట్ర సమస్యలున్నారుు. మరోచోట ఇసుక తవ్వకాలకు ఏర్పాట్లు లేవు. మిగిలిన 74 రీచ్‌ల్లో 94 లక్షల టన్నుల ఇసుక ఉంది. అరుుతే ప్రభుత్వం ఇప్పటివరకు  5 లక్షల టన్నుల ఇసుక మాత్రమే ఉన్న 9 జిల్లాల్లోని 24 పెద్దస్థారుు వాగులను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని నిర్ణరుుంచింది. అరుుతే చిత్తూరు జిల్లా కుప్పం మండలం కగొండిలోని పెద్దవంక చెరువులో మాత్రమే తవ్వకాలు ప్రారంభించారు. మిగిలిన చోట్ల వాగుల్లో నీరు ఎక్కువగా ఉన్న కారణంతో తవ్వకాలు జరగడం లేదు. వాస్తవానికి వాగుల్లోని ఇసుకలో మట్టి కలిసి ఉంటుందన్న కారణంతో దీనిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపరు. నాణ్యమైన నదీ పరివాహక ప్రాంత ఇసుకకే డిమాండ్ ఉంటుంది.  
 
అనుమతులు వచ్చాక అప్పగిస్తాం : మంత్రి సుజాత


 84 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత వాటినీ డ్వాక్రా మహిళ సంఘాలకు అప్పగిస్తామని గనుల శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గతంలో తవ్వకాలు జరిగిన రీచ్‌లలో ఇప్పుడూ తవ్వకాలు జరుగుతున్నట్టుగా అధికారులు సమాచారమిచ్చారని, దీనిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement