Reach the sand
-
ఎమ్మెల్యే బోడె అనుచరుల వీరంగం
ఇసుక తక్కువ లోడ్ చేశారన్నందుకు చితకబాదిన వైనం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే ఘటన చోద్యం చేసిన పోలీసులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన బాధితుడు విజయవాడ లీగల్ : పెదపులిపాక ఇసుక రీచ్‌లో ఇసుక తక్కువ లోడ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు, సీఐ మురళీకృష్ణ, ఇతర సిబ్బంది ఓ వ్యక్తిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం విజయవాడ ఒకటో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కె.శ్రీనివాస్ చక్రవర్తికి శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే తనను కర్రలు, రాడ్లతో కొడుతుంటే సీఐ పట్టించుకోకుండా చోద్యం చూశారని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఒంటిపై గాయూలు గమనించిన న్యాయమూర్తి అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం నివేదిక ఇవ్వమని ఆదేశించారు. వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన బిల్డర్ మంచికలపూడి వెంకటేశ్వరనాథ్ ఇసుక కోసం మీ సేవా కేంద్రంలో రెండు యూనిట్లకు సొమ్ము చెల్లించి బిల్లు తీసుకున్నాడు. అరుుతే, ఇసుక రెండు యూనిట్లకు తక్కువ రావడంతో ఈనెల పదో తేదీ మధ్యాహ్నం పెదపులిపాక వెళ్లి రీచ్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అప్పటికే అక్కడ పహారా కాస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు వెంకటేశ్వరనాథ్పై దాడికి దిగారు. ఇదంతా పెనమలూరు సీఐ మురళీకృష్ణ సమక్షంలోనే జరిగింది. బాధితుడిపై దాడి చేయడమే కాకుండా, పెదపులిపాక డ్వాక్రా మహిళల ద్వారా అక్రమ కేసులు బనాయించి స్టేషన్లో ఉంచి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పదో తేదీ నుంచి వెంకటేశ్వరనాథ్ ఆచూకీ తెలియక శుక్రవారం ఆయన బంధువులు కోర్టులో సెర్చ్ వారెంట్ వేయడానికి సిద్ధమయ్యూరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వరనాథ్పై సెక్షన్ 353 కింద అరెస్టు చేసి సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. దీంతో బాధితుడు తనపై జరిగిన దాడిని, సీఐ వ్యవహరించిన తీరును న్యాయమూర్తికి చెప్పడంతో ఆయన రాతపూర్వకంగా ఇవ్వమని ఆదేశించారు. సీఐని వివరణ కోరారు. బాధితుడికి ఎక్స్‌రే తీరుుంచగా, వైద్యులు కాలు విరిగినట్లు నిర్ధారించారు. -
ఇవిగో ఇసుక రవాణా ధరలు
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఇసుకను రీచ్‌ల నుంచి వినియోగదారుల వద్దకు టిప్పర్ల ద్వారా రవాణా చేసేందుకు ధరలు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో అధికారులు, టిప్పర్ల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల నుంచి ఐదు కిలోమీటర్లలోపు దూరానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఇసుక రీచ్‌ల నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు 11 టన్నుల కెపాసిటీ కలిగిన టిప్పర్ క్యూబిక్ మీటర్‌కు ఐదు కిలోమీటర్ల వరకు రూ.600, పది కిలోమీటర్ల వరకు రూ.1,000, అదనపు దూరానికి కిలోమీటర్‌కు రూ.80 చొప్పున ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. టిప్పర్లు, లారీ యజమానులను ఇసుక రవాణా చేసేందుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ టెండర్లలో టిప్పరు యజమానులు కొంత మంది క్యూబిక్ మీటర్ ఇసుక రావాణాకు 5 కిలోమీటర్లకు రూ.700 , 10 కిలోమీటర్లకు రూ.1,100, అదపు కిలోమీటర్‌కు రూ.90 చొప్పున ఇవ్వాలని కొటేషన్లు వేశారని చెప్పారు. తక్కువ ధరను కోట్ చేసిన టిప్పరు యజమానులను ఇసుక రవాణా చేసేందుకు అంగీకరించినట్లు వివరించారు. అనుమతి పొందిన వారు సంబంధిత ఇసుక రీచ్‌ల్లో వివరాలు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ పద్మజ, అడిషనల్ పీడీ తేళ్ల రవికుమార్, గనులశాఖ సహాయ సంచాలకుడు కే సుబ్రహ్మణ్యేశ్వరరావు, నరసింహారెడ్డి, ప్రాంతీయ రవాణాశాఖాధికారి కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
డ్వాక్రా సంఘాలకు మస్కా!
నాసిరకం ఇసుక ఉండే వాగులు మహిళా సంఘాలకు అనుమతుల్లేవంటూ నదీ పరివాహక రీచ్‌లను ఇవ్వని ప్రభుత్వం హైదరాబాద్: ఇసుక రీచ్‌లను మహిళలకు అప్పగించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేస్తామన్న ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోంది. నాణ్యమైన నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను, అనుమతులు లేవన్న కారణంతో డ్వాక్రా సంఘాలకు అప్పగించని సర్కారు.. నాణ్యత లేని పెద్ద వాగులను అప్పగించి చేతులు దులుపుకొంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత నెల 28 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు ఉన్న ఇసుక లీజులన్నీ రద్దరుునట్లేనని పేర్కొంటూ అదే రోజు ఆదేశాలు (జీవోఎంఎస్ నంబర్ 94) జారీ చేసింది. అరుుతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 84 ఇసుక రీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల్లేనందున, వీటిలో తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్ధం. ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించాలని రెండున్నర నెలల క్రితమే నిర్ణరుుంచినప్పటికీ, ఒక్కదానికి కూడా పర్యావరణ అనుమతి సాధించలేదు. ఈ అనుమతులకు ఉద్దేశించిన రాష్ట్రస్థాయి కమిటీ గడువు గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటుకు పూనుకోలేదు. ‘ప్రైవేటు’గా తరలిపోతున్న ఇసుక.. పాత లీజులను రద్దు చేసినా.. కొన్ని ప్రాంతాల్లో ఆ పేరిట ప్రైవేటు వ్యక్తులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 10 లీజుల వరకు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానికుల కథనం. జీవో జారీ చేసినప్పటికీ. లీజులు రద్దైనట్టు తమకు ఉత్తర్వులు అందని కారణంగానే పాత లీజులు యథావిధిగా కొనసాగిస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలంలో రోజుకు కనీసం 150 లారీలు, తాడేపల్లి మండలంలో రోజుకు 60 లారీల ఇసుక తరలిపోతున్నటు సమాచారం. కర్నూలు జిల్లా తుంగభద్ర నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుక తరలుతున్నట్లు సమాచారం. పర్యావరణ అనుమతులు లేవనే కారణంతో ఈ ఇసుక రీచ్‌లను తమకు అప్పగించని ప్రభుత్వం.. ప్రైవేటు వ్యక్తులు తవ్వకాలు కొనసాగిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డ్వాక్రా సంఘాలు ప్రశ్నిస్తున్నారుు. డ్వాక్రాల ఆధ్వర్యంలో ఒక్కచోటే తవ్వకాలు.. నదీ పరివాహక ప్రాంతాల్లోని 84 రీచ్‌లలో 9చోట్ల అంతర్రాష్ట్ర సమస్యలున్నారుు. మరోచోట ఇసుక తవ్వకాలకు ఏర్పాట్లు లేవు. మిగిలిన 74 రీచ్‌ల్లో 94 లక్షల టన్నుల ఇసుక ఉంది. అరుుతే ప్రభుత్వం ఇప్పటివరకు 5 లక్షల టన్నుల ఇసుక మాత్రమే ఉన్న 9 జిల్లాల్లోని 24 పెద్దస్థారుు వాగులను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని నిర్ణరుుంచింది. అరుుతే చిత్తూరు జిల్లా కుప్పం మండలం కగొండిలోని పెద్దవంక చెరువులో మాత్రమే తవ్వకాలు ప్రారంభించారు. మిగిలిన చోట్ల వాగుల్లో నీరు ఎక్కువగా ఉన్న కారణంతో తవ్వకాలు జరగడం లేదు. వాస్తవానికి వాగుల్లోని ఇసుకలో మట్టి కలిసి ఉంటుందన్న కారణంతో దీనిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపరు. నాణ్యమైన నదీ పరివాహక ప్రాంత ఇసుకకే డిమాండ్ ఉంటుంది. అనుమతులు వచ్చాక అప్పగిస్తాం : మంత్రి సుజాత 84 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత వాటినీ డ్వాక్రా మహిళ సంఘాలకు అప్పగిస్తామని గనుల శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గతంలో తవ్వకాలు జరిగిన రీచ్‌లలో ఇప్పుడూ తవ్వకాలు జరుగుతున్నట్టుగా అధికారులు సమాచారమిచ్చారని, దీనిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. -
డ్వాక్రాలకు ఇసుక ర్యాంపులు హుళక్కే?
అనకాపల్లి సర్కిల్ నదుల్లో అధికారుల పరిశీలన శారద, తాండవ పరిధిలో అధికారిక రీచ్‌లు లేనట్టే వరహా నదిలో మూడింటి అనుమతికి అవకాశం తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే అనకాపల్లి : ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అనకాపల్లి సర్కిల్ పరిధిలో అధికారికంగా వాటిని నిర్వహించే వీలు లేకుండాపోతోంది. అనకాపల్లి సర్కిల్ భూగర్భ గనుల శాఖ పరిధిలో ఏ ఏ చోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించవచ్చో తెలుసుకొనేందుకు వివిధ శాఖల అధికారులు చేపట్టిన సంయుక్త సర్వేలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అనకాపల్లి సర్కిల్లోని జాజిగెడ్డ- 1, 2, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్ పరిధిలో స్వయం సహా యక గ్రూపులు రీచ్‌లు నిర్వహించేం దుకు సరిపడా ఇసుక లేదని అధికారులు కొద్దిరోజుల క్రితం తేల్చారు. తాజాగా నదుల్లో ఇసుక రీచ్ లు ఏ ఏ చోట్ల నిర్వహించవచ్చో అంచనా వేసేం దుకు భూగర్భ గనుల శాఖ, నీటి పారుదల శాఖ, భూగర్భ జల వనరుల శాఖకు చెందిన బృందాలు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ శారదా, వరహా, తాండవ, సర్ప నదు ల్లో సర్వే చేపట్టాయి. 39 ప్రాంతాల్లో ఇసుక తవ్వకానికి గల అవకాశాలు, సాంకేతిక అవరోధాలను పరిశీలించాయి. వాల్టా చట్టం అవరోధంగా మారడంతో ఒక్క వరహా నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే మూడుచోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సర్వేలో గుర్తిం చాయి. అయితే సర్వే బృందం సమర్పించిన నివేదిక పరిశీలించి నిర్ణయం తీసుకునేది కలెక్టర్ కావడంతో ఎన్ని రీచ్‌లకు అనుమతి లభిస్తుందనేది ఉత్కంఠగా ఉంది. 21 మండలాలతో విశాలంగా ఉండే అన కాపల్లి సర్కిల్ పరిధిలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు అవకాశాలు లేకపోవడం డ్వాక్రా గ్రూపులకు నిరాశ కల్గించినట్టే. అక్రమార్కులపై చర్యలు శూన్యం అనధికారికంగా ఇసుక ర్యాంప్‌లు నిర్వహిస్తున్న వారిని అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవాల్సింది మండల స్థాయి అధికారులని చెప్పి తప్పించుకుం టున్నారు.