ఇక ఆన్‌లైన్‌లో.. మందుల ఇండెంట్
విజయనగరం ఆరోగ్యం : మందుల ఇండెంట్‌ను ఇకపై ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. ఈ మేరకు ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ హౌసింగ్ ఇనఫ్రాస్టక్చర్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్)అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆన్‌లైన్ ఇండెంట్‌పై రెం డు రోజుల క్రితం డీఎంహెచ్‌ఓలు, పీహెచ్‌సీ వైద్యులు, ఫార్మసిస్టులతో ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ అధికారులు సమావేశమయ్యూరు. ఆన్‌లైన్ ఇండెంట్‌కు సంబంధిం చి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆన్‌లైన్ ఇండింట్ కోసం ఈ- ఔషధి అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రుపొందించనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో మందుల ఇండెంట్ పెట్టనున్నారు. జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, 7 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి.
పభుత్వం సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు మందులు సరఫరా చేస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు మందులు సరఫరా చేస్తారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, వైద్య విధాన్ పరిషత్ సిబ్బంది ప్రతి నెలా వారికి అవరమయ్యే మందులు కోసం వైట్ పేపర్లపై ఇండెంట్ రాసి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు పెడతారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది ఇండింట్ వివరాలను ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ అధికారులకు పంపిస్తారు. ఇది ఇప్పు డు వరకు జరుగుతున్న తీరు. కానీ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలకనున్నా రు. ఆన్‌లైన్ ద్వారా ఇకపై మందుల ఇండింట్ పెట్టనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అంతేకాకుండా నేరుగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ కా ర్యాలయానికే పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి ఇండింట్ పెట్టవచ్చు.
మందుల దుర్వినియోగానికి చెక్ :
పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో మందులు దుర్వినియోగం అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అవసరం ఉన్నా.. లేకున్నా..అధిక మొత్తంలో మందులకు ఇం డింట్ పెట్టేయడం వల్ల కాలపరిమితి దాటే వరకు విని యోగం కాకపోవడం వల్ల వృథావుతున్నాయి. దీన్ని అరికట్టేం దుకు ఆన్‌లైన్ ఇండెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నా రు. నెలకు ఎన్ని రకాల మందులు అవసరమవుతాయి, ఎన్ని అవసరం అన్ని మందులకు మాత్రమే ఆన్‌లైన్‌లో ఇండింట్ పెట్టాలి. అధిక మొత్తంలో ఇండింట్ పెడితే ఎందుకు అన్ని మందులు అవసరమని సాప్ట్‌వేర్ ప్రశ్నిస్తుంది. అధిక మందులు అవసరాన్ని చెబితేనే సాప్ట్‌వేర్ ఒకే చేస్తుంది. లేకపోతే మొరాయిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యులు తెల్ల కాగితాలపై ప్రిసెక్షప్సన్‌లు రాసి ఇస్తున్నారు. ఇకపై పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు ఒకే రకం ప్రిసెక్షప్సన్ సరఫరా చేయనున్నారు. కే చీట్‌లు కూడా అంతే.