ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు.
ఉచిత, నిర్బంధ విద్య హక్కు (సవరణ) బిల్లుపై చర్చలో మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ:
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఉచిత, నిర్బంధ విద్య హక్కు (సవరణ) బిల్లు–2017పై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
శిక్షణ పూర్తి చేసుకోని ఉపాధ్యాయులు మార్చి 31, 2019లోగా శిక్షణ పూర్తిచేసుకునే అవకాశాన్ని ఈ బిల్లు ఇస్తోంది. పేద విద్యార్థులకు మంచి విద్య ఇస్తే అది ఈ దేశ సంక్షేమానికి ఉపయోగపడు తుందని, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారని మేకపాటి తెలిపారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఈ పథకం అమలు చేశారని చెప్పారు.