ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల పరిధిలోని రైతులందరికీ ఆయా సంఘాలలో సభ్యత్వం కల్పించి, ఖాతాలు తెరవాలని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పీఏసీఎస్ చైర్మన్లకు సూచించారు. సోమవారం హన్మకొండలోని డీసీసీబీ భవన్‌లో జరిగిన డీసీసీబీ మహాజన సభకు అధ్యక్షత వహించిన రాఘవరెడ్డి మాట్లాడారు. భవిష్యత్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ నేరుగా రైతులకే అందనున్నాయని, ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారని పేర్కొన్నారు. సహకా ర సంఘాల రికవరీ పెరిగితేనే ఆప్కాబ్ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకశాముందని చెప్పారు.
వరంగల్ డీసీసీబీ రాష్ర్టం లో అతి తక్కువ రికవరీ కలిగిన వాటిలో ఒకటిగా ఉందని, ఆప్కాబ్‌లో ఏమి మాట్లాడలేని పరిస్థితి రానీయవద్దని కోరారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు రుణాలు అందించనున్నామని, అవసరమున్న వారు పాస్‌బుక్‌లు అందించి పొందవచ్చని సూచించారు. జిల్లాలో ఎరువులకు కొదవ లేదు.. యూరియా అవస రం మేరకు అందుబాటులో ఉంది.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేని చెప్పారు. ఎరువుల కోసం బ్యాంకు గ్యారంటీ అవసరమున్న మేరకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తిరిగి సకాలంలో చెల్లించాలని సూచించారు.
డీసీసీబీలో పనిచేస్తున్న ఉద్యోగులగు గృహ రు ణాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు కొత్త ఆలోచనలతో ముందుకు రావాల ని, సంఘాల సీఈఓల పనితీరును ఎప్పటికప్పుడు కనిపెడుతూ సమీక్ష చేస్తూ ముందుకు పోవాలన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ అందిస్తామని, ప్రతినెలా స్టాక్ నివేదికలు ఇవ్వాలని కోరారు. జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రుణాలు, ఎరువుల సరఫరాకే పరిమితం కాకుండా ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని చెప్పారు.
గత ఏడాది 40 సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి రూ.180కోట్ల వ్యాపారం చేసిరూ.25లక్షల లాభం ఆర్జించినట్లు వివరించారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద నిధులు మంజూరయ్యాయని, దీని కింద చేపటాల్సిన పనులు వెంకటనే ప్రారంభించాలన్నారు. సం ఘాలలో సభ్యులకు మరణానంతరం పరిహారం చెల్లించాలని నల్లబెల్లి సహకార సంఘం చైర్మన్ కోరాగా దీనిపై ఆలోచించాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ సురేందర్, డీజీఎంలు పాక శ్రీనివాస్, కత్తి నర్సయ్య, డైరక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.
రైతులందరికీ సభ్యత్వం కల్పించాలి
Published Tue, Aug 13 2013 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement