కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో అంకిత భావంతో సేవలందించిన పలువురు సిబ్బంది ఉత్తమ ప్రతిభ అవార్డులతోపాటు నగదు బహుమతులను అందుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది సోమవారం హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధిశాఖ అపార్డ్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ నుంచి ప్రశంసాపత్రం, నగదును అందుకున్నారు.
ఉత్తమ ప్రతిభా అవార్డులు అందుకున్న ఏపీఓలు బి. రాజబాబు, ఎంకేఎస్ ప్రకాశరావు, జూనియర్ ఇంజనీర్ ఎం.ఈశ్వరరావు, ఇతర సిబ్బంది ఎం.వీరబాబు, టి.మురళీకృష్ణ, టి.శివ, టి.శేషగిరిరావు, ఎం.శివగణేష్, జి.రాజారావు, ఎం. విశ్వనాథ్‌లను జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ సంపత్‌కుమార్, ఏపీడీ భవానితోపాటు కార్యాలయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది అభినందించారు.
ఉపాధి సిబ్బందికి ప్రతిభా అవార్డులు
Published Tue, May 27 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement