'ఆ రహస్య ఒప్పందాలను బయటపెట్టాలి' | Meruga nagarjuna slams chandrababu naidu over amaravathi lands | Sakshi
Sakshi News home page

'ఆ రహస్య ఒప్పందాలను బయటపెట్టాలి'

Published Mon, Jun 20 2016 3:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Meruga nagarjuna slams chandrababu naidu over amaravathi lands

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీలలో చేసుకున్న రహస్య ఒప్పందాలను బయటపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెల్ల కాగితాల మీద ఫ్లాట్ల బొమ్మలు గీసి రైతులకు ఇవ్వటం దారుణమన్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచారన్నారు. చిన్న వర్షానికే నేడు అమరావతిలో ఫ్లాట్ల పంపిణీ వాయిదా వేశారని, దీన్నిబట్టే పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు. అమరావతిని ఇతర దేశాలకు అమ్మేయడమే చంద్రబాబు లక్ష్యమని మేరుగ నాగార్జున మండిపడ్డారు. 33వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాలు అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement