అక్టోబరు 2న నగరానికి మెట్రో మోడల్ కోచ్
నగరవాసుల కలల మెట్రో రైలుకోచ్ త్వరలో నగరానికి చేరుకోనుంది. అక్టోబరు 2న మోడల్ కోచ్‌ను నక్లెస్‌రోడ్డులో ప్రదర్శించనున్నట్లు హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ భోగీల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు.
దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు భోగీలు(కోచ్)తయారు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సంస్థకు 171 భోగీలకు ఆర్డరు ఇచ్చినట్లు ఎండీ తెలిపారు. అత్యాధునిక వసతులుండే ఈ ఏసీ భోగీ ఒక్కొక్కటి రూ.10 కోట్ల వ్యయంతో తయారవుతున్నాయన్నారు. కాగా రాష్ట్ర విభజన అంశంతో సంబంధం లేకుండా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు గడువులోగా పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టంచేశారు.