రహదారులు రుచి మరిగాయోమో.. వలస కార్మికుల రక్తం ధార కడుతూనే ఉంది. నెల రోజుల పాటు నడకయాతన అనుభవించిన శ్రామికులు.. ఇప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. మందస మండలంలో వలస కూలీలను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 36 మంది కార్మికులుగాయపడ్డారు. వీరి ఆర్తనాదాలతో ఆ దారంతా మార్మోగింది. బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడినా ఓ విద్యుత్ స్తంభం బస్సును అడ్డుకోవడం, కరోనా భయం ఉన్నా స్థానికులు,పోలీసులు సమయానికి సాయం చేయడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి.
మందస: వలస కార్మికులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఉన్న ఊరిలో ఉపాధి లేక.. వలస వెళ్తే కరోనా కాటు వేసింది. అక్కడ నుంచి స్వస్థలాలకు వచ్చేద్దామంటే లాక్‌డౌన్ అందరి కాళ్లను కట్టేసింది. వట్టి కాళ్లతో ప్రయాణం ప్రారంభిస్తే ఆకలి దప్పికలు ప్రాణాలు తీశాయి. ఎట్టకేలకు వాహనాలను ఆశ్రయిస్తే ప్రమాదాలు భయపెడుతున్నాయి. మందస మండలం బాలిగాం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం వలస కార్మికులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడి 36 మంది గాయపడ్డారు. కార్మికులంతా పశ్చిమ బంగకు చెందిన వారు. కర్నాటకలో పనిచేస్తూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ లోగా ఈ ప్రమాదం బారిన పడ్డారు.
నిద్రమత్తే కారణమా..?
పశ్చిమ బంగలోని హుగ్లీకి చెందిన కార్మికులు బెంగళూరులో పనిచేస్తున్నారు. కరోనా రాకతో వీరి ఉపాధి పోయింది. దీంతో ఇన్నాళ్లూ ఎలాగోలా అక్కడే కుటుంబాలతో రోజులు గడిపారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బస్సులు వేయడంతో స్వస్థలాలకు వచ్చేద్దామని బయల్దేరారు. పశ్చిమ బంగకే చెందిన స్నేహలత ట్రావెల్స్ వారి బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్, క్లీనర్‌తో కలిసి మొత్తం 41 మంది ప్రయాణికులు సోమవారం కర్నాటకలో బయల్దేరారు. మందస మండలంలోని జాతీయ రహదారిపై బాలిగాం సమీపంలోని అండర్‌పాసేజ్ వద్దకు వచ్చేసరికి బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ ఆశిష్ కుమార్ ప్రమాణిక్ నిద్రమత్తు కారణంగా స్టీరింగ్‌పై నియంత్రణకోల్పోయినట్టు భావిస్తున్నారు. దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టి, లోతుగా ఉన్న పొలాల్లోకి పడిపోయింది. అదృష్టవశాత్తు విద్యుత్ స్తంభం అడ్డుకోవడంతో మరో పల్టీ కొట్టకుండా అక్కడే ఆగింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఘటనలో సుమారు 36 మందికి గాయాలయ్యాయి. క్లీనర్ సంజీబ్ చక్రబొర్తి కూ డా గాయపడ్డాడు.
స్థానికుల పెద్ద మనసు..
బాధితుల ఆర్తనాదాలతో సంఘటనా స్థలం మార్మోగగా స్థానికులు వెంటనే ఘ టనా స్థలానికి చేరుకున్నారు. అసలే వల స కార్మికులు, ఆపై కరోనా భయం.. దీంతో మొదటిలో సాయం చేయడానికి జంకినా.. క్షతగాత్రుల బాధను చూసి వారు ఆగలేకపోయారు. బస్సు అద్దాలను పగులగొట్టి, బస్సు లోపల నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఈ లోగా మందస ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మిగిలిన కూలీలను బయటకు తీశారు. పలాస 108 సిబ్బంది ఎన్.వెంకటరావు, కేవీ రమణ, నేషనల్ హైవే అంబులెన్స్, హైవే పెట్రోలింగ్ సి బ్బంది గాయపడిన వారికి చికిత్స అందజేశారు. క్షతగాత్రులను హరిపురం సా మాజిక ఆరోగ్య కేంద్రం, పలాస ప్రభుత్వాస్పత్రిలకు తరలించారు. వీరిలో తా ప్పిపాండే అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే మందస తహసీల్దార్ డి.ఆనంద్‌కుమార్, ఎంపీడీఓ వాయలపల్లి తిరుమలరావు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, ఎస్‌ఐ కె.వెంకటేష్, కానిస్టేబుల్స్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇచ్ఛా పురం ఎంవీఐ మోపిదేవి శశికుమార్ చే రుకుని బస్సు ఫిట్‌నెస్, వ్యాలిడిటీ పత్రాలను తనిఖీ చేసి, అన్ని సక్రమంగానే ఉ న్నట్టు తెలిపారు. ప్రమాదం నుంచి బ యట పడిన కూలీలు తమ వారిని చూసుకుని బిక్కుబిక్కుమంటూ సంఘటనా స్థలంలో ఉండిపోయారు. దీంతో అధికారులు స్పందించి వీరిని కుంటికోట వద్ద గల గిరిజన యూత్ శిక్షణ కేంద్రానికి తరలించి, భోజనం, వసతి ఏర్పాటు చే శారు. టెక్కలి ఆర్డీఓ ఐ.కిషోర్ వైటీసీని సందర్శించి, బాధితులను పరామర్శించి, వసతులు పరిశీలించారు. మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలాస ఆస్పత్రిలో క్షతగాత్రులు
కాశీబుగ్గ : వలస బస్సు ప్రమాద బాధితుల ఆర్తనాదాలతో పలాస ప్రభుత్వాస్పత్రి మార్మోగింది. వీరిని తీసుకువచ్చి న అంబులెన్సులలో ఎటుచూసినా రక్తపు మరకలే కనిపించాయి. వీరిలో సుప్రాణా కు తలకు గాయం కాగా, లోక్‌కాంత్ సుందర్ వెన్నుముక విరిగింది, మానస పాండే కాలువిరిగింది, సౌముల్య దాస్ గర్భి ణి. రామక్రిష్ణ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ మడే రమేష్ దగ్గరుండి అత్యవసర సేవ లు అందించారు. పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ ఆ స్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కాశీబుగ్గ ఏఎస్‌ఐ శేఖర్ క్షతగాత్రులకు టిఫిన్, పండ్లు అందజేశారు.
క్షతగాత్రుల తరలింపు
బస్సు ప్రమాదంలో గాయపడిన వా రిని కలెక్టర్ జె.నివాస్ చొరవతో వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశా రు. మంగళవారం రాత్రి పలాస ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా బస్సులు తెప్పించి క్షతగాత్రులందరినీ పశ్చిమ బంగలోని వారి స్వస్థలాలకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment