ఫైల్ ఫొటో
సాక్షి, విజయవాడ : నగరంలోని శేష సాయి కళ్యాణ మండపంలో సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ షోకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభించింది. రమేష్ హాస్పిటల్స్ ప్రధాన స్పాన్సర్ గా ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మెగా హెల్త్ షోను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
నగరంలోని 14 ప్రముఖ హాస్పిటల్స్ ఈ షోలో తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఈ హెల్త్ షో కు హాజరైన ప్రజలకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రా హాస్పిటల్స్, సంధ్య కంటి ఆసుపత్రి, అను హాస్పిటల్స్, కామినేని, మణిపాల్, శ్రీకర, సాయి భాస్కర్, క్యాపిటల్ హాస్పిటల్స్, ఎంజె నాయుడు, నాగార్జున, విజిఆర్, పెయిన్ హాస్పిటల్స్, శ్రీ స్వరూప, ఓబుల్ రెడ్డి డెంటల్, డాక్టర్ ఎండోకేర్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు.
పలువురు పేషంట్లకు నిపుణులైన వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను కూడా పంపిణీ చేశారు. ఖరీదైన గుండె పరీక్షలు, కంటి వైద్య పరీక్షలు, కాలేయం, కిడ్నీ పరీక్షలు, రక్త పరీక్షలను కూడా ఉచితంగా ప్రజలకు అందించారు. ‘సాక్షి’ ఇటువంటి షో నిర్వహించడం పట్ల పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.
డాక్టర్ విక్రమ్, ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , విజిఆర్ డయాబెటిక్ డాక్టర్ విజయ్ శ్రీనివాస్, శ్రీ స్వరూప హాస్పిటల్స్ డాక్టర్ పాలడుగు రామకృష్ణ, డాక్టర్ కిరణ్మయి, ఎండోకేర్ హాస్పిటల్స్ డాక్టర్ సుదర్శన్, రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ రఘునాధం, శ్రీకర హాస్పిటల్స్ డాక్టర్ భార్గవ రామ్, సంధ్య హాస్పిటల్స్ డాక్టర్ జీవీ రెడ్డి, మణిపాల్ హాస్పిటల్స్ డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్, పెయిన్ మేనేజ్ మెంట్ హాస్పిటల్స్
డా. నాగేశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేషంట్లు కొండలరావు, నెమ్మలూరి చంద్రశేఖర్ విక్టోరియా, సాగరాజు శర్మ, ఆకుల దుర్గా ప్రసాద్, కమలమ్మ, జయశ్రీ, రంగనాధ్ తదితరులు తమ వ్యాధులకు పరీక్షలు చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment