అలా చెప్పడానికి ఆయనెవరూ.. | Minister Kodali Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనలో ప్రతి ఇంట ఆనందం..

Published Tue, Jan 14 2020 11:59 AM | Last Updated on Tue, Jan 14 2020 4:29 PM

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ గుడివాడలో జరిగే సంక్రాంతి వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాయని చెప్పారు. కాటికి కాలు చాపిన వయసులో కూడా చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంక్రాంతి పండుగను చేసుకోవద్దని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ధ్వజమెత్తారు. ఆయన సంక్రాంతి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు చేసుకోకూడదా అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.

చదవండి: సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement