
సాక్షి, అమరావతి: కష్టకాలంలో సైతం రైతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రమిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకు గుండె తరుక్కుపోతుందో అర్థం కావడంలేదని.. బహుశా సీఎం వైఎస్ జగన్ రైతులను ఆదుకోవడానికి స్పందిస్తున్న తీరు చూసి గుండె తరుక్కుపోతుందేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. టమోటా పంటలు కొనుగోలు చేస్తున్నందుకు ఆయన బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నీ హయాంలో ఎందుకు చేయకలేకపోయావంటూ చంద్రబాబును నిలదీశారు.
(కరోనా కట్టడిలో మరో వినూత్న ఆలోచన)
‘‘ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించమని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా ఫైనల్ లిస్ట్ ఇంకా తయారు కాలేదు. అప్పుడే 4 లక్షల మంది రైతులను తొలగించారంటున్నారు. ఎక్కడ తొలగించారో చంద్రబాబే చెప్పాలి. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయబట్టే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. తడిసిన ధాన్యంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయిన వారిని వెంటనే ఆదుకుంటున్నాం. రైతుల మన్ననలు పొందుతున్నామని ఆయనకు కడుపు మంట’’ అంటూ చంద్రబాబుపై కన్నబాబు నిప్పులు చెరిగారు.
(అందరూ అదే మాట.. నిజం చెప్పిన నేత)
పొగాకు రైతుల సమస్యలపై మంత్రి సమీక్ష
పొగాకు రైతుల సమస్యలపై మంత్రి కన్నబాబు, పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరు చోట్ల పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించామని.. మిగిలిన ప్రాంతాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒంగోలు రెడ్ జోన్ కావడంతో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. పట్టణంలోకి వేరే ప్రాంతాల ద్వారా రైతులు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని.. పొగాకు రైతులు, వ్యాపారులకు రక్షణ చర్యలు తీసుకున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment