
సాక్షి, అమరావతి: కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు పరికరాన్ని రూపొందిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్ మోడ్యూల్ ని తయారు చేస్తామని.. ఇప్పటికే కంపెనీలతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరోనా పేషేంట్‌కి ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా నిరంతరం ట్రాక్ చేయొచ్చన్నారు. దేశంలో మొదటిసారి ఏపీలోనే చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ మోడ్యూల్ అవసరం చాలా ఉంటుందన్నారు. గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
(తోక జాడిస్తే కత్తిరిస్తాం : ఏపీ సీఐడీ)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాపై చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం చెప్పింది వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ ప్రపంచమంతా ఉంటుందన్నారు. దేశంలోనే అందరికంటే ఎక్కువ నియంత్రణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కరోనా టెస్ట్‌లు చేయడంలో ఏపీ ప్రథమస్థానంలో ఉందని.. కిట్ల ఉత్పత్తి కూడా మనమే చేస్తున్నామని మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment