సీసీరోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
పెద్దకడబూరు: అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టిన వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ. 1.25 కోట్లు పంచాయతీ నిధులు, రూ. 5లక్షలు ఎంపీపీ నిధులతో పాటు తమ సొంత నిధులు రూ. 5 లక్షలతో డ్రెయినేజి, సీసీరోడ్లు, మంచినీటి పైప్‌లైన్, నీటి తొట్టెలు నిర్మించామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 200కోట్లు ఖర్చు పెట్టినట్లు టీడీపీ నాయకులు మాటల్లో చెబుతున్నారని, వాస్తవం అయితే వాటికి ఆధారాలు చూపించాలన్నారు. అభివృద్ధిని తాము మాటల్లో కాదని చేతల్లో చూపించే రకమన్నారు.
రాబోయేది రాజన్న రాజ్యమే..
రాబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. రోబోయే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల తీర్పుపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో తాము ముందున్నామన్నారు. ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని, సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ బాలముని, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర యూత్ నాయకులు వై. ప్రదీప్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడు విజయేంద్ర రెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్య, మాజీ సర్పంచ్ సత్యనారాణగౌడ్, మండల నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment