రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుంది: బాలినేని | MLA Balineni demands MLAs Resignations | Sakshi
Sakshi News home page

రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుంది: బాలినేని

Published Thu, Aug 15 2013 3:40 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.

ఒంగోలు : ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్ఆర్ సీపీకి ముఖ్యం అని ఆయన చెప్పారు. తమ రాజీనామాలను శాసనసభాపతి చేత ఆమోదింప చేసుకుంటామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలన్నారు. పదవుల కోసం మంత్రులు ఆరాటపడుతుంటే,  వారి భార్యలు దీక్షచేయడం సిగ్గుచేటన్నారు. విభజనకు బీజం వేసింది వైఎస్ఆర్ అంటూ నిందవేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.  

రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్రాన్ని సోనియా గాంధీ ముక్కలు చేస్తున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement